సెప్టెంబర్‌లో 65 శాతం పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు
ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్, గడచిన సెప్టెంబర్ నెల అమ్మకాలలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. ఐషర్ మోటార్స్‌కి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అన్ని మోటార్‌సైకిళ్ల అమ్మకాల జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 2013తో పోల్చుకుంటే సెప్టెంబర్ 2014లో కంపెనీ అమ్మకాలు ఏకంగా 65 శాతం వృద్ధిని కనబరచాయి.
గడచిన నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తంగా 28,020 మోటార్‌సైకిళ్లను విక్రయించగా (ఎగుమతులతో కలిపి), అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో మొత్తంగా 17,005 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. సెప్టెంబర్ 2014లో దేశీయ విపణిలో 27,540 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, 480 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది.

చెన్నై సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వలనే అమ్మకాలు పెరుగినట్లు తెలుస్తోంది. ఈ ప్లాంటులో సగటున ప్రతినెలా 10,000 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఉండే భారీ డిమాండ్ కారణంగా, వాటి వెయింట్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ, 500సీసీ రేంజ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. భవిష్యత్తులో మరింత ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








