షెల్ యేయ్ కాంటెస్ట్: బైక్ రైడ్ కథ చెప్పుకో, పల్సర్ గెలుచుకో
మీకు మోటార్‌సైకిల్‌పై లాంగ్ ట్రిప్‌లు చేయడమంటే సరదానా..? గతంలో మీరెన్నడైనా అడ్వెంచరస్ లాంగ్ రైడ్ చేశారా..? కనీసం వర్షంలో రైడ్ చేశారా..? మోటార్‌సైకిల్‌పై మీ అనుభం ఏదైనా సరే దానిని కథ రూపంలో చెప్పగలిగితే, మీరు పల్సర్ బైక్ గెలుచుకోవచ్చు.
ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ 'షెల్' బైకర్ల కోసం ఓ కొత్త కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ పేరు 'యేయ్' (Yyaayy). ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థనలు చేయాల్సిందల్లా, తమ బైక్ రైడ్‌లో యేయ్ అనిపించిన క్షణాలను ఆసక్తికరమైన బైకింగ్ స్టోరీగా తయారు చేసి, వెబ్‌సైట్‌లో మీరు మీ బైక్ ఫొటోతో పాటుగా అప్‌లోడ్ చేయటమే.

షెల్ ప్రతిరోజు మరియు ప్రతివారం ఇలా వచ్చిన బైకింగ్ స్టోరీలలో బెస్ట్ స్టోరీలను సెలక్ట్ చేసుకొని, చివరిగా కాంటెస్ట్ ముగింపు సమయంలో లక్కీ విజేతను ఎన్నుకోవటం జరుగుతుంది. ఇలా లక్కీ విజేతగా నిలిచిన వారికి సరికొత్త బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను కానుకగా ఇవ్వటం జరుగుతుంది.
'ఎంజాయ్ ఎవ్రీ రైడ్' అనే థీమ్‌తో సాగే షెల్ అడ్వాన్స్డ్ టెలివిజన్ ప్రకటనలో భాగంగా, ఈ క్యాంపైన్ మూడు వారాల పాటు సాగుతుంది. భారతదేశంలో షెల్ ఆయిల్స్ మోటార్‌సైకిళ్ల కోసం అధునాతనమైన, మెరుగైన వివిధ రకాల ఆయిళ్లను సరఫరా చేస్తుంది.
షెల్ యేయ్ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








