సుజుకి జిక్సర్ బైక్, లెట్స్ స్కూటర్‌లు విడుదల
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ నేడు (జనవరి 27, 2014) రెండు సరికొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేసింది. సుజుకి మోటార్‌సైకిళ్ల బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సుజుకి స్కూటర్ల బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటీమణి పరిణీతి చోప్రా ఈ ఉత్పత్తులను విడుదల చేశారు. ఇందులో ఓ 150సీసీ మోటార్‌సైకిల్ మరియు ఓ 110సీసీ స్కూటర్‌లు ఉన్నాయి.
సుజుకి జిక్సర్ (Suzuki Gixxer) మోటార్‌సైకిల్‌ను సల్మాన్ ఖాన్ ఆవిష్కరించగా, సుజుకి లెట్స్ (Suzuki Let's) స్కూటర్‌ను పరిణీతి చోప్రా ఆవిష్కరించారు. స్పోర్ట్స్ బైక్‌ల నుంచి స్ఫూర్తి పొంది, 150సీసీ సెగ్మెంట్లోని ఇతర దేశీయ మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా తమ 155సీసీ జిక్సర్ బైక్‍ను అభివృద్ధి చేశామని, అలాగే 110సీసీ స్కూటర్ సెగ్మెంట్లో మెరుగైన మైలేజీనిస్తూ, ఈ సెగ్మెంట్లోని యాక్టివా, ప్లెజర్ వంటి మోడళ్లకు సవాలుగా తమ లెట్స్ స్కూటర్‌ను ప్రవేశపెట్టామని కంపెనీ పేర్కొంది.

ఈ రెండు మోడళ్లు కూడా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీతో లభ్యం కానున్నాయి. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది.
ఈ రెండు మోడళ్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








