జనవరి 27న సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 విడుదల
గత కొద్ది కాలంగా అదిగో ఇదిగో అంటూ బైక్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన సుజుకి ఇనాజుమా మోటార్‌సైకిల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్, భారత మార్కెట్లో ఓ సరికొత్త 250సీసీ బైక్ 'ఇనాజుమా జిడబ్ల్యూ 250' (Suzuki Inazuma GW 250)ను ఈ నెల 27న విడుదల చేయనుంది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా గతంలో ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనవరి 2014లో కొత్త 250సీసీ బైక్ (ఇనాజుమా జిడబ్ల్యూ 250)ను విడుదల చేస్తామని, అలాగే ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడతామని వెల్లడించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, జనవరి 27, 2014న ఇది దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల కానుంది.

సుజుకి ఇనాజుమా 250 లేదా జిడబ్ల్యూ 250గా ఈ పిలిచే ఈ బైక్‌ను దేశాల నుంచి విడిభాగాల రూపంలో దిగుమతి (సికెడి రూట్లో) చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. ఇందులో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.
ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెను వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఇక స్టయిలింగ్ విషయంలో ఇది జపనీస్ డిజైన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ధర విషయానికి వస్తే రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్ 250ఆర్, కవాసకి 250, కెటిఎమ్ డ్యూక్ 250 వంటి మోడళ్లకు సవాలుగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








