సుజుకి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఇనాజుమా 'మిస్సింగ్'!

By Ravi

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, ఈ ఏడాది జనవరి నెలలో విడుదల చేసిన సరికొత్త 250సీసీ బైక్ 'సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250' (Suzuki Inazuma GW 250) బైక్ భారత బైకర్లను ఆకట్టుకోవటంలో విఫలమైంది.

సుజుకి ఇనాజుమా అమ్మకాలు ఆశించిన రీతిలో ఉండకపోవటంతో, గడచిన జూన్ నెలలో కంపెనీ ఈ బైక్ ధరలో లక్ష రూపాయల తగ్గింపును ప్రకటించింది. అయినా సరే, ఈ బైక్ అమ్మకాలు మాత్రం పుంజుకోలేదు. ప్రస్తుతం కంపెనీ అఫీషియల్ వెబ్‍‌సైట్‌లో సుజుకి ఇనాజుమా కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే, కంపెనీ ఈ బైక్‌ను మార్కెట్ నుంచి సైలెంట్‌గా తొలగించినట్లు తెలుస్తోంది.

Suzuki Inazuma

జపనీస్ భాషలో 'ఇనాజుమా' అంటే తుఫాను సమయంలో వచ్చే భారీ 'మెరుపు' అని అర్థం. ఈ పేరుకు సార్థకత కల్పించేలా తమ ఇనాజుమాను డిజైన్ చేశామని, ఇందులోని శక్తివంతమైన 250సీసీ ఇంజన్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుందని గతంలో కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

సుజుకి ఇనాజుమా 250 లేదా జిడబ్ల్యూ 250గా ఈ పిలిచే ఈ బైక్‌ను విదేశాల నుంచి విడిభాగాల రూపంలో దిగుమతి (సికెడి-కంప్లీట్లీ నాక్డ్ డౌన్ రూట్లో) చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేశారు. మొదట్లో ఈ బైక్ ధర రూ.3.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉండేది. జూన్‌లో లక్ష రూపాయలు తగ్గించిన తర్వాత దీని ధర రూ.2.14 లక్షల (ఎక్స్-షోరూమ్, పూనే)కు చేరుకుంది.

Most Read Articles

English summary
Suzuki had launched the Inazuma in India for INR 3,10,000 ex-showroom. The bike was not well appreciated by customers and they dropped their price by a lakh. In the end their motorcycle was priced at INR 2,21,066 ex-showroom, Mumbai. We now believe the Japanese manufacturer has lost hope in their project.
Story first published: Monday, November 17, 2014, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X