సుజుకి జిక్సర్ లాంచ్ డేట్ ఖరారు, సెప్టెంబర్ 9న విడుదల

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆవిష్కరించిన తమ సరికొత్త 150సీసీ బైక్ 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer)ను వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేసేందుకు తేదీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 9, 2014వ తేదీన ఈ 150సీసీ బైక్ భారత మార్కెట్లో విడుదల కానుంది.

సుజుకి అందిస్తున్న జిఎస్ఎక్స్-ఆర్ 1000సీసీ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త సుజుకి జిక్సర్‌ను డిజైన్ చేశారు. ఇందులో 154.9సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.9 పిఎస్‌ల శక్తిని, 19.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి.

Suzuki Gixxer

సుజుకి జిక్సర్ బైక్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఉపయోగించారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ, ఇప్పటికే హోండా అందిస్తున్న 'హోండా ఈకో టెక్నాలజీ' (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన ఇంజన్ మెకానికల్ లాసెస్ తగ్గి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌లు పెరగటంతో పాటు మెరుగైన మైలేజీని కూడా పొందవచ్చు. సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ సెగ్మెంట్లో హీరో హంక్, హోండా సిబి ట్రిగ్గర్, బజాజ్ పల్సర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

సుజుకి జిక్సర్ డిజైన్‌ను గమనిస్తే, దీని హెడ్‌‌లైట్ నుంచి టెయిల్ లైట్ వరకు ప్రతి డిజైన్ ఎలిమెంట్ కూడా ఎంతో స్టయిలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి జిక్సర్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 6, 2014, 15:40 [IST]
English summary
Suzuki Motorcycles India Limited has launched the Let's scooter and have now confirmed to launch its Gixxer on 9th of September, 2014. The motorcycle was showcased at the 2014 Auto Expo held in Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+