హయబుసా రీప్లేస్‌మెంట్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్న సుజుకి!
జపనీస్ టూవీలర్ కంపెనీ అందిస్తున్న పవర్‌ఫుల్ సూపర్‌బైక్ సుజుకి త్వరలోనే మార్కెట్ నుంచి తొలగిపోనుంది. ఈ మోడల్‌ను రీప్లేస్ చేస్తూ ఓ సరికొత్త సూపర్‌బైక్‌ను ప్రవేశపెట్టేందుకు సుజుకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. హయబుసా గడచిన 15 ఏళ్లుగా సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు ఎవర్‌గ్రీన్ మోడల్‌గా ఉంది.
సుజుకి హయబుసా బైక్‌ను విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ ఇందులో ప్రధాన మార్పులు చేయలేదు. అయితే బ్రెంబూ బ్రేక్ కాలిపర్, ఏబిఎస్ జోడించటం వంటి అప్‌గ్రేడ్స్ చేసింది. హయబుసా 1999లో మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుంచి ఇందులో ఉపయోగిస్తున్న ఇంజన్‌లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సుజుకి హయబుసా సూపర్‌బైక్‌లో 1340సీసీ, 4-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో లభిస్తుంది.
మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్‌ను అనుసరించి, తమ వినియోగదారులకు మరింత మెరుగైన ఉత్పత్తిని అందించాలనే ఉద్దేశ్యంతోనే సుజుకి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో కానీ లేదా 2016వ సంవత్సరంలో కానీ హయబుసా రీప్లేస్‌మెంట్ మోడల్‌ను సుజుకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








