హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ట్రైయంప్ బుకింగ్స్
గడచిన నవంబర్ 28, 2013న భారత మార్కెట్లో తమ కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన బ్రిటీష్ మోటార్‌సైకిల్ కంపెనీ 'ట్రైయంప్', ఇప్పుడు తమ హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఈ మోటార్‌సైకిళ్లకు బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అయితే, ఈ రెండు నగరాల్లో డీలర్‌షిప్‌లు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మరో రెండు మూడు వారాల వ్యవధిలో ఈ షోరూమ్‌లు ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది.
షోరూమ్‌లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోయినప్పటికీ, ట్రైయంప్ బైక్ ప్రియులను తమ ఫేవరేట్ బైక్ కోసం ముందస్తు బుకింగ్ చేసుకునే విధంగా కంపెనీ ఈ వెసులుబాటు కల్పించింది. ట్రైయంప్ దేశీయ విపణిలో మొత్తం 10 కొత్త బైక్‌లను విడుదల చేసింది.

ఇందులో ఆరు మోడళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. అవి - ట్రైయంప్ బోన్నెవిల్లె, ట్రైయంప్ బోన్నెవిల్లే టి100, ట్రైయంప్ డేటోనా 675ఆర్, ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్, ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్, ట్రైయంప్ త్రక్స్టన్. మార్కెట్లో వీటి ధరలు రూ.5.7 లక్షల నుంచి రూ.11.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.
మిగిలిన నాలుగు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. అవి - ట్రైయంప్ రాకెట్ 3 రోడ్‌స్టర్, ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్, ట్రైయంప్ టైగర్ 800 ఎక్స్‌సి, ట్రైయంప్ థండర్‌బర్డ్ స్ట్రోమ్. వీటి ధరలు రూ.20 లక్షల వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








