సెప్టెంబర్ 18న సరికొత్త ట్రైయంప్ మోటార్‌సైకిల్ విడుదల

ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ట్రైయంప్' (Triumph) ఈనెల 18వ తేదీన ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ట్రైయంప్ ఇండియా ఇప్పటికే దేశీయ విపణిలో 10 మోడళ్లను విక్రయిస్తోంది. కాగా.. తమ 11వ ఉత్పత్తిని సెప్టెంబర్ 18, 2014వ తేదీన విడుదల చేయనుంది. ఈమేరకు కంపెనీ ఓ టీజర్ ఫొటోను కూడా విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: ట్రైయంప్ బైక్స్ మరియు వాటి వివరాలు

ఈ టీజర్ ఫొటోను బట్టి చూస్తే, ట్రైయంప్ ఇండియా మరో సరికొత్త క్రూజర్‌ను భారత్‌లో విడుదల చేయబోతుందని అర్థమవుతోంది. గడచిన సంవత్సరం (2013) నవంబర్ నెలలో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. ప్రస్తుతం ట్రైయంప్ ఇండియా నుంచి 10 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆరు మోడళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో, మిగిలిన నాలుగు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.

Triumph

ట్రైయంప్ బోన్నెవిల్లె, ట్రైయంప్ బోన్నెవిల్లే టి100, ట్రైయంప్ డేటోనా 675ఆర్, ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్, ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్, ట్రైయంప్ త్రక్స్టన్ మోడళ్లను సికెడి రూట్లో విడిభాగాలుగా ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తున్నారు. మార్కెట్లో వీటి ధరలు రూ.5.7 లక్షల నుంచి రూ.11.4 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

ఇకపోతే, ట్రైయంప్ రాకెట్ 3 రోడ్‌స్టర్, ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్, ట్రైయంప్ టైగర్ 800 ఎక్స్‌సి, ట్రైయంప్ థండర్‌‌బర్డ్ స్ట్రోమ్ మోటార్‌సైకిళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తున్నారు. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉన్నాయి.

కాగా.. ట్రైయంప్ కొత్త విడుదల చేయనున్న మోడల్‌ను సిబియూ రూట్లోనే దిగుమతి చేసుకోవచ్చని అంచనా. ఈ బైక్‌కి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, September 12, 2014, 14:23 [IST]
English summary
Triumph India has confirmed to launch a new motorcycle on 18th September, 2014. British two wheeler wanted to offer all of its products at once, thus offering a wider range to its fans.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+