ట్రైయంప్ మోటార్‌సైకిళ్ల కొనుగోలుకు హెచ్‌డిఎఫ్‌సి లోన్స్
ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించిన ప్రీమియం మోటార్‌సైకిల్ కంపెనీ ట్రైయంప్, తమ ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సితో చేతులు కలిపింది. ఈ ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, ట్రైయంప్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయదలిచిన కస్టమర్లకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సాలీనా 12.9 శాతం ఆకర్షనీయమైన వడ్డీ రేటుతో 24 నెలల నుంచి 60 నెలల కాల వ్యవధి వరకు ఫ్లెక్సిబల్ ఆప్షన్లతో రుణాలను అందించనుంది. అంతేకాకుండా, పటిష్టమైన వినియోగదారుల విషయంలో పర్సనలైజ్డ్ డోర్‌స్టెప్ సర్వీస్‌ను కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తుంది. అంటే, బ్యాంక్ సిబ్బంది వ్యక్తిగతంగా కస్టమర్లకు ఇంటికి విచ్చేసి, రుణ స్కీమ్‌లను వివరించి, వాహన రుణాన్ని ఆఫర్ చేయటం జరుగుతుంది.

ట్రైయంప్ గడచిన నవంబర్ నెలాఖరులో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించి, 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో ఆరు మోడళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. అవి - ట్రైయంప్ బోన్నెవిల్లె, ట్రైయంప్ బోన్నెవిల్లే టి100, ట్రైయంప్ డేటోనా 675ఆర్, ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్, ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్, ట్రైయంప్ త్రక్స్టన్. మార్కెట్లో వీటి ధరలు రూ.5.7 లక్షల నుంచి రూ.11.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.
మిగిలిన నాలుగు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. అవి - ట్రైయంప్ రాకెట్ 3 రోడ్‌స్టర్, ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్, ట్రైయంప్ టైగర్ 800 ఎక్స్‌సి, ట్రైయంప్ థండర్‌బర్డ్ స్ట్రోమ్. వీటి ధరలు రూ.20 లక్షల వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








