హిమాచల్ ప్రదేశ్‌లో టీవీఎస్ మోటార్స్ ఇంజన్ ప్లాంట్

By Ravi

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ లిమిటెడ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో కొత్త ఇంజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఇంజన్ ప్లాంట్ కోసం కంపెనీ దాదాపు 150 కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించనుంది. ఆ రాష్ట్రంలో ఇది టీవీఎస్‌కి రెండవ ప్లాంట్ కానుంది.

హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ఇంజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు గాను తాము రూ.150 కోట్ల పెట్టుబడి చేయనున్నామని, ఈ సౌకర్యం కోసం తమ ధరఖాస్తును ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించామని టీవీస్ మోటార్ కంపెనీ డైరెక్టర్‌ ఆర్‌ రామకృష్ణన్‌ తెలిపారు.

తమ ప్లాంట్ కోసం 50 ఎకరాల భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. అంతకు ముందు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ బెంగుళూరుకు వచ్చినప్పుడు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా టీవీఎస్‌ని కోరారు. ఈ ప్లాంట్ కోసం 24 గంటలపాటు నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా ఇస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు.

TVS Motor Plans Engine Plant In Himachal Pradesh

టీవీఎస్ మోటార్ కంపెనీ 2007లో హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన్‌ జిల్లాలో ఉన్న నాలాగఢ్‌లో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుత హిమాచల్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేస్తున్న వాహనాల విక్రయాల వల్ల రూ.900 కోట్ల వరకు టర్నోవర్‌ జరగుతోంది. ఈ ప్లాంట్‌లో టీవీఎస్‌ స్టార్‌ సిటీ, టీవీఎస్‌ స్పోర్ట్‌, టీవీఎస్‌ జూపిటర్‌ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు.

హిమాచల్‌ ప్లాంట్‌లో సాలీనా 6 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సమార్థ్యం ఉన్నప్పటికీ, కంపెనీ సాలీనా 3 లక్షల యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్‌లో తయారవుతున్న ద్విచక్ర వహనాలను ఉత్తరభారత దేశం, మధ్యభారతదేశంలో విక్రయిస్తున్నారు.

Most Read Articles

English summary
TVS Motor Company is planning to set up a new engine manufacturing plant in Himachal Pradesh with an investment of about Rs.150 crore. It will be the company’s second manufacturing plant in the State. 
Story first published: Monday, November 10, 2014, 11:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X