టీవీఎస్ భవిష్యత్తు మోటార్‌సైకిళ్ల కన్నా స్కూటర్లపైనే ఆధారపడి ఉంది

By Ravi

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, ప్రస్తుతం అత్యంత పోటీతో కూడుకున్న ద్విచక్ర వాహన విభాగంలో రాణించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇప్పుడు కొనుగోలుదారుల ట్రెండ్ కాస్తా, మోటార్‌‍సైకిళ్ల నుంచి స్కూటర్ల వైపుకు మళ్లుతున్న నేపథ్యంలో, టీవీఎస్ కూడా ఈ విభాగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం టీవీఎస్ స్కూటీ స్ట్రీక్, స్కూటీ పెప్ ప్లస్, వెగో, జూపిటర్ స్కూటర్లను విక్రయిస్తోంది. గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ ప్రదర్శించిన స్కూటర్లకు మంచి స్పందన లభించింది. కంపెనీ ఇటీవలే విడుదల చేసిన జూపిటర్ కూడా మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, టీవీఎస్ భవిష్యత్ అంతా మోటార్‌సైకిళ్ల కన్నా స్కూటర్లపైనే ఎక్కువ ఆధారపడినట్లు కనిపిస్తోంది.

TVS Motors

మార్కెట్లో స్కూటర్లకు ఉన్న గిరాకీ మోటార్‌సైకిళ్లకు ఉండటం లేదు. 2015 ఆర్థిక సంవత్సరం నాటికి తమ స్కూటర్ రేంజ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని టీవీఎస్ యోచిస్తోంది. రానున్న రోజుల్లో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు కూడా పుంజుకోగలవని టీవీఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన కమ్యూటర్ మోటార్‌సైకిల్ స్టార్ సిటీ ప్లస్ కూడా మంచి విజయాన్ని సాధించింది.

రానున్న సంవత్సరాల్లో టీవీఎస్ మోటార్ కంపెనీ మరిన్ని పవర్‌ఫుల్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆటోమేటిక్ స్కూటర్ల పట్ల కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యం, వారి ఇష్టానికి అనుగుణంగా వివిధ శ్రేణిలలో ఉత్పత్తులను అందించాలని కంపెనీ యోచిస్తోంది. స్కూటర్లపై దృష్టి సారించినప్పటికీ, మోటార్‌సైకిళ్ల విషయంలో మాత్రం కంపెనీ అశ్రద్ధ వహించబోదని తెలుస్తోంది. త్వరలోనే టీవీఎస్ నుంచి మరిన్ని కొత్త ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 5, 2014, 12:25 [IST]
English summary
The Indian automobile sector has been witnessing a slowdown in recent times. However, TVS Motors has managed to stay afloat, owing to the success of its scooters in the Indian market. The trend among buyers is ever changing and now buyers prefer the ease of an automatic scooter over a motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+