టీవీఎస్ నుంచి రెండు సరికొత్త మోటార్‌సైకిళ్లు
చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, మరికొద్ది రోజుల్లోనే దేశీయ విపణిలో రెండు సరికొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయనుంది. ఇటీవలే సరికొత్త స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌ను మరియు జెస్ట్ స్కూటర్ విడుదల చేసిన టీవీఎస్, తాజాగా మరో రెండు మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో కమ్యూటర్ బైక్ సెగ్మెంట్లో ఒక ఉత్పత్తిని (టీవీఎస్ విక్టర్ రీలాంచ్) మరియు మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో (రిఫ్రెష్డ్ అపాచే) మరో ఉత్పత్తిని విడుదల చేసేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తోంది. టీవీఎస్ ఈ కొత్త మోడళ్ల విడుదలతో తమ మార్కెట్ వాటాను పెంచుకొని, ప్రతినెలా 60,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయాలనే లక్ష్యంతో ఉంది.

ఈ రెండు ఉత్పత్తులో ముందుగా.. టీవీఎస్ నుంచి గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాపులర్ బైక్ 'టీవీఎస్ విక్టర్'ను కంపెనీ పునఃప్రవేశపెట్టనుంది. ప్రధానంగా గ్రామీణ, పట్టణ మార్కెట్లలోని కస్టమర్లును టార్గెట్ చేసుకొని అధునాతన ఇంజన్, ఆకట్టుకునే డిజైన్, మెరుగైన మైలేజ్, సరసమైన ధర వంటి ఫీచర్లతో కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
అలాగే, టీవీఎస్ అందిస్తున్న పాపులర్ అపాచే బ్రాండ్‌లో కంపెనీ మరో కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను పరిచయం చేయనుంది. వచ్చే ఏడాది మార్చ్-ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త టీవీఎస్ అపాచే మోటార్‌సైకిల్‌లో కాస్మోటిక్ మార్పులతో పాటుగా మెకానికల్ మార్పులు కూడా ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అపాచే బ్రాండ్‌లో 160సీసీ మరియు 180సీసీ మోడళ్లు అందుబాటులో ఉ్ననాయి.

ఇకపోతే.. టీవీఎస్ మోటార్ కంపెనీ, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, బిఎమ్‌డబ్ల్యూ కోసం టీవీఎస్ అభివృద్ధి చేస్తున్న తొలి ద్విచక్ర వాహనాన్ని వచ్చే ఏడాది (2015) ద్వితీయార్థం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఓ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








