స్కూటర్ల కోసం టీవీఎస్ టైర్స్ నుంచి 'డ్రాగన్ టైర్'

By Ravi

దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ద్విచక్ర, త్రిచక్ర వాహనాల టైర్ బ్రాండ్ 'టీవీఎస్ టైర్స్' స్కూటర్ల కోసం కొత్త రకం టైర్లను పరిచయం చేసింది. 'డ్రాగన్ టైర్స్' పేరిట విడుదలైన ఈ టైర్లను ప్రత్యేకించి టీవీఎస్‌ స్కూటీ పెప్‌ ఫ్యామిలీ, బజాజ్‌ స్పిరిట్‌, ఎల్‌ఎమ్ఎల్‌ ట్రెండీ వంటి వాహనాల కోసం ప్రత్యేకంగా తయారు చేశామని, ఇవే కాకుండా అన్ని రకాల స్కూటర్లకు ఈ టైర్లు సెట్ అవుతాయని కంపెనీ తెలిపింది.

ఈ విభంగాలో కెల్లా మొట్టమొదటి సారిగా 3.00-10 డ్రాగన్ టైర్ రగ్గడ్ బ్లాక్ ప్యాటర్న్ కలిగి ఉంటుందని, దీని ఫలితంగా అన్ని రకాల రోడ్లపై అత్యుత్తమ రోడ్ గ్రిప్ లభిస్తుందని టీవీఎస్ టైర్స్ వెల్లడించింది. ప్రత్యేకించి తడిసిన రోడ్లపై సైతం ఈ డ్రాగన్ బ్రాండ్ టైర్లు మంచి రోడ్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తాయని, ఈ టైర్ సైడ్ వాల్స్ కూడా ఆకర్షనీయమై డిజైన్‌ను కలిగి ఉండి మంచి లుక్‌నిస్తాయని కంపెనీ తెలిపింది.

డ్రాగన్‌ బ్రాండ్ టైర్లు ఈ విభాగంలో తప్పకుండా మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకొని ప్రథమ స్థానాన్ని సంపాధిస్తుందని, టైర్స్ కోసం త్వరలోనే టీవీఎస్‌ సంస్థ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించిందని, వినియోగదారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావించి తమ సంస్థ సరికొత్త టెక్నాలజీతో కూడిన టైర్లను, ప్రత్యేకించి భారతీయ రోడ్లకు అనుగుణంగా ఉండే టైర్లను తయారు చేస్తోందని టీవీఎస్ టైర్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

TVS Tyres Launche Dragon Tyre For Scooters

More from DriveSpark

Article Published On: Thursday, January 23, 2014, 13:38 [IST]
English summary
TVS Tyres, the largest selling 2 and 3 wheeler tyre brand in the country, recently launched 'Dragon' tyres for scooter. This tyre is most suited for TVS Scooty Pep family, Bajaj Spirit and LML Trendy, and targets customers who expect more from the tyres.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+