వీడియో: బజాజ్ డిస్కవర్ 150ఎఫ్, 150ఎస్ డిటేల్స్

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ అందిస్తున్న డిస్కవర్ బ్రాండ్‌లో కంపెనీ ఇటీవలే 150సీసీ వెర్షన్ బైక్‌లను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. డిస్కవర్ 150ఎఫ్ (లార్జ్ హాఫ్ ఫెయిరింగ్‌తో), డిస్కవర్ 150ఎస్ (స్టాండర్డ్ ఫెయిరింగ్‌తో) పేర్లతో కంపెనీ రెండు 150సీసీ వెర్షన్ డిస్కవర్ మోడళ్లనుమార్కెట్లో విడుదల చేసింది. తాజాగా, ఈ డిస్కవర్ 150 బైక్స్ ఫీచర్లను వీడియో రూపంలో వెల్లడి చేస్తూ ఓ కమర్షియల్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.

కొత్త 150సీసీ వెర్షన్ డిస్కవర్ 150ఎఫ్, డిస్కవర్ 150ఎస్ రెండు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 145సీసీ, 4-వాల్వ్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 14.5 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త బజాజ్ డిస్కవర్ 150సీసీ బైక్స్ లీటరుకు 72 కి.మీ. మైలేజీనిస్తాయి.

మెరుగైన కంఫర్ట్ కోసం ఈ రెండు బైక్‌లలో నైట్రాక్స్ సస్పెన్షన్‌తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్‌‌ను ఉపయోగించారు. సమర్థవంతమైన బ్రేకింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇవి పెటల్ డిస్క్ బ్రేక్స్‌తో లభిస్తాయి. స్టయిలిష్ డిజిటల్ మీటర్, బెటర్ రోడ్ గ్రిప్ కోసం వెడల్పాటి ట్యూబ్‌లెస్ టైర్స్, డిసి లైటింగ్ (తక్కువ వేగం వద్ద కూడా కాంతివంతమైన లైటింగ్) వంటి ఫీచర్లు కొత్త 150సీసీ డిస్కవర్ బైక్‌ల సొంతం. ఇవి డార్క్ బ్లూ, వైన్ రెడ్, ఎబోనీ బ్లాక్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లలో లభ్యమవుతాయి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/cXWwhzaSqk0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, August 26, 2014, 11:49 [IST]
English summary
Presenting all new Bajaj Discover 150,Designed to refresh your everyday ride. Recently Bajaj Auto has launched its 150cc Discover twins. The new Bajaj Discover 150S and Discover 150F are powered by a 145cc 4-valve single-cylinder DTS-i with ExhausTEC engine that churns out 14.5 PS of power and 12.75Nm of torque.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+