ఆగస్ట్ 2014 నెలలో 24 శాతం పెరిగిన యమహా సేల్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన ఆల్ఫా ఫ్యామిలీ స్కూటర్, ఎఫ్‌జెడ్ వెర్షన్ 2.0 మరియు ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0 మోడళ్ల సక్సెస్‌తో గడచిన నెలలో కంపెనీ ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది.

ఆగస్ట్ 2013తో పోల్చుకుంటే ఆగస్ట్ 2014లో కంపెనీ అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది 42,995 యూనిట్ల నుంచి 53,242 యూనిట్లకు పెరిగాయని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

యమహా నిర్వహిస్తున్న జిప్పీ కార్నివాల్, యమహా చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్, యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ మొదలైన కార్యక్రమాల వలన కూడా తమ బ్రాండ్‌కు మంచి ప్రచారం లభించి, అమ్మకాలు జోరందుకున్నాయని కంపెనీ తెలిపింది.

Yamaha Scooters

భారత టూవీలర్ మార్కెట్లో తాము ప్రతినెలా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నామని, ఇటీవల విడుదల చేసిన ఆల్ఫా స్కూటర్‌‍తో పాటుగా రిఫ్రెష్డ్ వెర్షన్ ఎఫ్‌జెడ్ సిరీస్ 150సీసీ మోటార్‌సైకిళ్లు కూడా మంచి వృద్ధిని కనబరచాయని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియెన్ తెలిపారు.

ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0 (153cc), ఎఫ్‌జెడ్ వెర్షన్ 2.0 (153cc), ఎస్‌జెడ్-ఎక్స్, ఎస్‌జెడ్-ఆర్ & ఎస్‌జెడ్-ఆర్ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc), రే (113cc), రే జెడ్ (113cc) మరియు ఆల్ఫా (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 2, 2014, 19:24 [IST]
English summary
Continuing with its upward sales growth trend, Yamaha Motor India Sales Pvt. Ltd. has registered a growth of 24% in domestic sales during August 2014 as compared to the corresponding period last year. The company sold 53,242 units in August 2014 as against 42,995 units sold in August last year in the domestic market thereby registering a domestic sales growth of 24%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+