వీడియో: యమహా ఆర్25 బైక్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఇటీవలే ఇండోనేషియాలో తమ కొత్త 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'యమహా వైజెడ్ఎఫ్-ఆర్25'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. వచ్చే ఏడాది నాటికి ఈ 250సీసీ బైక్ ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో యమహా ఆర్25 ట్రాక్ టెస్ట్‌కు సంబంధించిన ఓ వీడియోని కంపెనీ విడుదల చేసింది. ఇదే వీడియోలో తమ యమహా ఆర్25 బైక్‌కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ వివరించింది.
యమహా ఆర్25 బైక్‌లో సరికొత్త 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ డయాసిల్ (డై కాస్టింగ్ అల్యూమినియం సిలికాన్) అనే విశిష్టమైన సిలిండర్లను ఉపయోగించుకుంటుంది. దీని వలన ఇంజన్ బరువు తగ్గడమే కాకుండా, వేడి కూడా తక్కువగా ఉంటుంది. యమహా ఓ 2-సిలిండర్ ఇంజన్‌లో ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి.
ఈ బైక్‌లోని 249సీసీ, లిక్విడ్ కూల్డ్, 2-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 హార్స్ పవర్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‍బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. యమహా అందిస్తున్న వైజెడ్ఆర్-ఎమ్1 మోటోజిపి రేస్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్25 బైక్‌ను డిజైన్ చేశారు. మనం కూడా ఈ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/QpNul8IKQys?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








