బజాజ్ ఆటో తమ చేతక్ స్కూటర్లను తిరిగి తీసుకొస్తుందా?

By Ravi

భారత ద్విచక్ర వాహన విభాగంలో చరిత్ర సృష్టించిన బజాజ్ చేతక్ స్కూటర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో. ఒకప్పట్లో స్టేటస్ సింబల్‌గా నిలిచిన బజాజ్ స్కూటర్లు తర్వాతి కాలంలో ఆటోమొబైల్ రంగంలో చోటు చేసుకున్న పలు విప్లవాత్మక మార్పుల కారణంగా కాలగమనంలో కలిసిపోయిన సంగతి తెలిసినదే.

ప్రస్తుతం కేవలం మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిపై మాత్రమే దృష్టి సారిస్తున్న బజాజ్ ఆటో తిరిగి స్కూటర్ విభాగంలోకి ప్రవేశించాలంటే చేతక్ స్కూటర్లను మోడ్రన్ టెక్నాలజీ, అధునాత ఇంజన్లతో పునరిద్ధరించడమే ఉత్తమ మార్గం. అయితే, బజాజ్ ఆటో మాత్రం ప్రస్తుతానికి స్కూటర్ విభాగంపై దృష్టి సారించే ఆలోచనలు లేవని చెబుతోంది.

Bajaj Auto Contemplating Revival Of Chetak Scooter

కానీ, మార్కెట్ వర్గాల సమాచారాన్ని పరిశీలిస్తే.. బజాజ్ ఆటో తిరిగి తమ చేతక్ స్కూటర్లను 125సీసీ ఇంజన్‌తో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1960లో రాజస్థాన్‌కు చెందిన "రాహుల్ బజాజ్" అనే ఓ యువ పారిశ్రామిక వేత్త బజాజ్ స్కూటర్లకు ప్రాణం పోశారు. ఇటలీ కంపెనీ నుంచి తెచ్చుకున్న ఆజ్ఞాపత్రం (లైసెన్స్)తో స్కూటర్ల తయారీకి శ్రీకారం చుట్టారు.

స్కూటర్ల తయారీకి గతంలో రాహుల్ బజాజ్ సంసిద్ధిత వ్యక్తం చేసినప్పటికీ, అతని కుమారుడు రాజీవ్ బజాజ్ మాత్రం సుముఖంగా లేరని సమాచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో బజాజ్ స్కూటర్లు తిరిగి మార్కెట్లోకి వస్తాయా లేదా అనే విషయాన్ని నేరుగా కంపెనీనే వెల్లడించాల్సి ఉంది.

Most Read Articles

English summary
Bajaj Auto is planning of reviving the scooter segment in India with its own product. The best way for them to do this is by re-inventing their Chetak scooter, which was a popular choice back in the days. Indian manufacturer had stopped working on scooters and provided complete attention to the development of their motorcycles.
Story first published: Saturday, March 14, 2015, 16:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X