ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బజాజ్, కెటియమ్ మరియు కవాసకి మోటార్ సైకిల్స్
బజాజ్, కెటియమ్ మరియు కవాసకి కి చెందిన అన్ని టూవీలర్లుబెంగుళూరు మహానగరంలో ఫ్లిప్ కార్ట్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు వారికి కావాల్సిన మోటార్ సైకిల్‌ను ఇంటి నుంచి బుక్ చేసుకోవచ్చు.
Also Read: హీరో మాయెస్ట్రో స్కూటర్ ఎడ్జ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ....
బజాజ్ వారి అతి తక్కువ బడ్జెట్ టూ వీలర్ సిటి100 నుండి కవాసకి వారి అత్యంత ఖరీదైన హెచ్2 వరకు అన్ని మోడల్స్ కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఇలా బుక్ చేసుకునే వారు బుకింగ్ ఫీజు గా 3,000 రుపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీ బుకింగ్ నమోదు అయిన తరువాత మీ వివరాలను సమీపంలోని డీలర్‌కు అందిస్తుంది.
Also Read: బజాజ్ ప్లాంట్ ద్వారా హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ తయారీ.
మీరు కోరుకున్న బైకు యొక్క టెస్ట్ రైడింగ్ సదుపాయాలను డీలర్ షిప్ వారు స్వయంగా మీకు కల్పిస్తారు. ఆ తరువాత డాక్యుమెంటేషన్ వంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా డీలర్ షిప్ వారు పూర్తి చేసి మీకు బైకును అందిస్తారు.
Also Read: మీ జన్మ నక్షత్రానికి తగిన కారు ఏదో తెలుసా ?



Click it and Unblock the Notifications








