మార్చ్ 26న విడుదల కానున్న బజాజ్ పల్సర్ ఆర్ఎస్200
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో విక్రయిస్తున్న పల్సర్ మోటార్‌సైకిల్‌లో 'పల్సర్ ఆర్ఎస్200' (Pulsar RS200) అనే సరికొత్త ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. ఈ మేరకు కంపెనీ టీజర్ ఫొటోలను, వీడియోని కూడా విడుదల చేయటం చూశాం.
కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సరికొత్త 2015 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 బైక్‌ను మార్చ్ 26వ తేదీన మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆవిష్కరించిన 400సీసీ స్పోర్ట్స్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ సరికొత్త పల్సర్ 200ఆర్ఎస్ (ఆర్ఎస్ అంటే బహుశా రేసింగ్ స్పోర్ట్ అని అర్థం కావచ్చు)ను తయారు చేశారు.

ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న పల్సర్ బైక్‌లలో కెల్లా అత్యంత శక్తివంతమైన పల్సర్ బైక్ ఇదని కంపెనీ తమ టీజర్‌లో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 200ఎన్ఎస్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే ఈ కొత్త పల్సర్ ఆర్ఎస్200లోను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఇంజన్‌ను ట్యూనింగ్ చేసే అకాశం కూడా ఉంది.
పల్సర్ 200ఎన్ఎస్‌లోని 199.5సీసీ, సింగిల్ సిలిండర్, 3-స్పార్క్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 24.4 పిఎస్‌ల శక్తిని, 18.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








