శ్వేత విప్లవం సృష్ఠించనున్న బజాజ్ పల్సర్ ఆర్‌యస్200
బజాజ్ పల్సర్ ఆర్‌యస్200 ప్రేమికులకు ఒక శుభ వార్త. బజాజ్ టూవీలర్స్‌కు ప్రాణం పోసిన పల్సర్ మోడల్ పేరుతో విడుదలైన పల్సర్ ఆర్‌యస్200 బైకు ఎంతో మందిని యువతను ఆకట్టుకుంది. అందుకోసం బజాజ్ టూవీలర్స్ తమ అన్ని పల్సర్ ఆర్‌యస్200 బైకులను కొత్త రంగులోల అందించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా తమ వినియోగాదారుల కోసం తెలుపు రంగులో ఈ మోడల్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
Also Read: భారతదేశపు భవిష్యత్తు మోటార్ సైకిల్స్...ఇవి ఎలా ఉంటాయి ?
మరి తెలుపు రంగును ఇష్టపడే వారి కోసం బజాజ్ వీటిని కొత్త పెయింట్ జాబ్‌తో తయారు చేశారు. ఇప్పటికే ఎంతో మంది యువత ఈ బజాజ్ పల్సర్ ఆర్‌యస్200 బైక్‌కు పట్టం కట్టారు. మరి మీరు...? ఒక్క నిమిషం దీని గురించి మరిన్ని విషయాలు క్రింది స్లైడ్రలో ఉన్నాయి. వీటి చూసి తరువాత ఈ బైక్ గురించి ఆలోచించండి.

పేరు
బజాజ్ పల్సర్ కొత్త పెయింట్ జాబ్ మన ముందుకు ప్రవేస పెట్టనున్న ఈ టూవీరలర్‌కు ఇంకా పేరును ఖరారు చేయలేదు. కాని ఈ ఆర్‌యస్ 200 వైట్ పెయింట్ జాబ్‌తో వచ్చిన ఈ బైకు చూట్టానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

ఇంజన్
ఈ బజాజ్ పల్సర్ ఆర్‌యస్200 వైట్ పెయింట్ జాబ్ బైకులో అత్యంత శక్తివంతమైన 199.5 సీసీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

పవర్
ఇందులో గల ఇంజన్ దాదాపుగా 24.16 బిహెచ్‌పి పవర్ మరియు 18.6 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ట్రాన్స్‌మిషన్
బజాజ్ పల్సర్ ఆర్‌యస్ 200 బైక్ ఈ మొత్తం పవర్‌ను ఇందులో గల 6-స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా వెనుక చక్రానికి అందిండంలో సహాయపడుతుంది.

కలర్స్
బజాజ్ పల్సర్ ఆర్‌యస్200 వేరియంట్లను బజాజ్ సంస్థ ఇప్పటికే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల చేసింది. డెమోన్ బ్లాక్ మరియు ఎంజిలిక్ వైట్.

భద్రత
బజాజ్ టూవీలర్స్ వీటిలో భద్రత పరంగా యాంటి -లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ని ఇందులో అందించింది. మరియు మన ఇష్టాన్ని బట్టి ఇందులో ఆప్షనల్‌గా వీటిని అందించారు.

ధర
బజాజ్ పల్సర్ కొత్త గా అందించిన ఈ కొత్త పెయింట్ జాబ్ టూవీర్స్‌ను ఏ మాత్రం ఎక్కువ ధరకు అందించలేదు. ఈ కొత్త ఆర్‌యస్200 లో గల స్డాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.20 లక్షల మరియు ఎబియస్ వేరియంట్ ధర రూ. 1.32 లక్షల వరకు ఉండవచ్చు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ
వీడియో
బజాజ్ పల్సర్ ఆర్‌యస్200 న్యూ పెయింట్ జాబ్ తో వచ్చిన బైక్‌ని ప్రక్కన గల వీడియో ద్వారా వీక్షించండి.

- భారతీయులు అత్యధికంగా ఇష్టపడుతున్న టాప్-10 టూవీలర్లు
- అమ్మ బాబోయ్ ఇంత ఖరీదైన బైకా...!!
- 82 మైలేజ్‌తో దుమ్ములేపనున్న డిస్కవర్ ?


Click it and Unblock the Notifications








