భారతీయ టూవీలర్ మార్కెట్లోకి విడుదలైన బెనెల్లీ టియన్‌టి25 ధర రూ. 1.68 లక్షలు

By Anil

ఇటాలియన్ కు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బెనెల్లీ తమ ప్రారంభపు మోటార్ సైకిల్ ‌ను భారతీయ టూ వీలర్ మార్కెట్లోకి 1.68 లక్షల రుపాయలకు విడుదల చేసింది. ముఖ్యంగా దీనిని 200 నుండి 250 సీసీ మధ్య గల వాహనాలకు పోటిగా విడుదల చేశారు. దీనిని బెనెల్లీ వారు డియస్‌కె భాగస్వామ్యంతో తయారు చేసినట్లు తెలిపారు.

దీని రాక కెటియమ్ డ్యూక్ 200 మోడల్‌కు ప్రాణ సంకటంగా మారినట్లు తెలిస్తోంది. ఎందుకంటే కెటియమ్‌ కన్నా ఇందులో కొన్ని మంచి ఫీచర్లు ఉన్నాయి. మరి బెనెల్లీ టియన్‌టి25 గురించి మరింత తెలుసుకుందాం రండి.

ఇంజన్

ఇంజన్

ఇందులో 249.2సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 28.156బిహెచ్‌పి పవర్ మరియు 21.61 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

బెనెల్లీ టియన్‌టి25 బైకు గంటకు 145 కిలో మీటర్ల అత్యధిక వేగంతో దూసుకుపోగలదు. దీనిలో 17 లీటర్ల కెపాసిటి గల ఇంధన ట్యాంక్ కలదు. ఇది లీటర్‌కు దాదాపుగా 35 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇందులో 6-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్ గేర్ బాక్స్ కలదు, ఈ గేర్ బాక్స్‌లో మొదటి గేర్ క్రిందకు మరియు మిగతా ఐదు గేర్లు పైకి వేయడానికి గేర్ షిఫ్ట్ ను ఆపరేట్ చేయవలసి ఉంటుంది.

సస్పెన్షన్

సస్పెన్షన్

దీనిలో ముందు వైపు ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుకవైపున హైడ్రాలిక్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

కొలతలు

కొలతలు

  • పొడవు: 2080 ఎన్ఎమ్
  • వెడల్పు: 810 ఎమ్ఎమ్
  • ఎత్తు 1125 ఎమ్ఎమ్
  • వీల్ బేస్: 1400 ఎమ్ఎమ్
  • గ్రౌండ్ క్లియరెన్స్: 160 ఎమ్ఎమ్
  • టియన్‌టి25 బరువు: 159 కిలోలు
  • ఫీచర్లు

    ఫీచర్లు

    అల్లాయ్ వీల్స్, ముందు మరియు వెనుకవైపున డిస్క్ బ్రేక్‌లను అందించారు. వెనుకవైపున 140 మరియు ముందువైపున 110 సెక్షన్ గల టైర్లను ఇందులో అందించారు.

    ధర

    ధర

    ఇందులో రెండు రకాల టైర్లను అందించారు, వీటిని బట్టి ఈ బెనెల్లీ టియన్‌టి బైకు రెండు రకాల ధరలను కలిగి ఉంది.

    • ఎమ్‌ఆర్ఎఫ్ టైర్లు గల బైకు ధర రూ. 1.68 లక్షలు
    • మెట్జిలర్ టైర్లు గల బైకు ధర రూ. 1.75 లక్షలు
    • రెండు ధరలు ఎక్స్-షోరూమ్, (ఢిల్లీ) గా ఉన్నాయి.

      పోటి దారులు

      పోటి దారులు

      ఎంతటి వారికైనా పోటి తప్పదు. అలాగే ఈ బెనెల్లీ టియన్‌టి25 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కెటియమ్‌ డ్యూక్ 200, హోండా సిబిఆర్250ఆర్ మరియు మహీంద్రా మోజో టూ వీలర్లకు పోటిగా నిలవనుంది.

      బుకింగ్స్

      బుకింగ్స్

      బెనెల్లీ టియన్‌టి25 కోసం దాదాపుగా 250 బుకింగ్స్ నమోదు అయ్యాయని తెలిపారు. అయితే సుమారుగా 6,000 యూనిట్ల వరకు బెనెల్లీ టియన్‌టి బైకుల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

      హై కెపాసిటి టూ వీలర్స్
      1. మహీంద్రా వారి హై కెపాసిటి బైక్: "మోజో" రివ్యూ
      2. హోండా మోటార్ సైకిల్స్ గురించి మరిన్ని వివరాలు

More from DriveSpark

Article Published On: Friday, December 18, 2015, 18:54 [IST]
English summary
Benelli TNT 25 Launched In India For Rs. 1.68 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+