బెనెల్లీ టియన్‌టి 600ఐ లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర రూ 5.58 లక్షలు
డి.ఎస్.కె బెనెల్లీ తన 600ఐ లిమిటెడ్ ఎడిషన్(యల్.ఇ) మోటర్ సైకిల్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ-5.58 లక్షలు ఎక్స్ షోరూం ఢిల్లిగా నిర్ణయించింది. ఇటలీ కి చెందిన ద్విచక్ర వాహన తయారి సంస్థ డి.ఎస్.కె తో భాగస్వామ్యం కోసం సుముఖంగా ఉంది.

టి.యన్.టి 600ఐ ఆధారంతో 600ఐ లిమిటెడ్ ఎడిషన్ తయారు చేశారు. కాని అప్పటికే 600ఐ ఎల్.ఇ మార్కెట్లో అమ్మాకాలు సాగిస్తున్నాయి. కేవలం 60 బైక్‌లను మాత్రమే తయారు చేశారు. దీని గురించి మరింత క్లుప్తంగా తెలుసుకుందాం...........
మెకానికల్ పరంగా ఎలాంటి మార్పు లేదు, కాని బంగారం మరియు నలుపు రంగుల ద్వారా 600ఐ నుండి 600ఐ ఎల్.ఇ వేరుచేయబడింది. వీల్స్ బూడిద రంగుతో, బ్రేక్స్ మరియు క్లచ్ లీవర్స్ పసుపు రంగుతో రూపాంతరం చెందాయి.

మరింత చదవండి: ఆర్ఇ60 ని ఎగుమతి చేస్తున్న బజాజ్
ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్:
- 600 సీసీ, లిక్విడ్ కూల్డ్, ఇన్ లైన్ 4-సిలిండర్ ఇంజిన్
- 85 బి.హెచ్.పి
- 54 ఎన్.ఎమ్ పీక్ టార్క్
- 6-స్పీడ్ గేర్ బాక్స్

- అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్
- రియర్ మోనో షాక్స్
- ముందు వైపున రెండు డిస్క్‌లు
- వెనుకవైపున సింగిల్ డిస్క్ కలదు

డి.ఎస్.కె బెనెల్లీ భారత మార్కెట్లో ప్రస్తుతం ఐదు రకాల మోడళ్లను విక్రయిస్తోంది- టి.ఎన్.టి 1130ఆర్, టి.ఎన్.టి 899, టి.ఎన్.టి 600ఐ, టి.ఎన్.టి 600జి.టి మరియుటి.ఎన్.టి 302. అమ్మకాల పరంగా చూస్తే కంపెనీ వృద్ధి బాగానే ఉంది.


Click it and Unblock the Notifications








