సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్: మరి ఇందులో మీ బైక్ ఉందా?
సొసైటి ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ (యస్.ఐ.ఎ.యమ్) వారి గణాంకాల ప్రకారం హీరో మోటో కార్ప్ కంపెనీకి చెందిన స్పెండర్ మోడల్ టూవీలర్స్ అత్యధికంగా 243,188 బైక్‍లు కేవలం ఒక్క సెప్టెంబర్ నెలలోనే అమ్ముడుపోయాయి. అయితే గత సంవత్సరంఇదే నెలలో 234,844 యూనిట్ల స్ల్పెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయి అంటే గత ఏడాదితో పోల్చకుంటే వీటి అమ్మకాలు 3.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన ద్విచక్ర వాహనాల ఆన్-రోడ్ ధరలు మరియు వాటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింది స్లయిడర్ల మీద ఓ లుక్కేసుకోండి.

10. టి.వి.యస్ జూపిటర్:
గత సంవత్సరంలో అత్యధిక అవార్డులు గ్రహీత అయిన టి.వి.యస్ జూపిటర్ 48,866 యూనిట్ల అమ్మకాలు జరిపి 45.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
ఆన్-రోడ్ ధర రూ. 63,050.
Also Read: మొదటి సారిగా టూవీలర్లకు ప్రచార కర్తగా మారిన అమితాబచ్చన్

9. టి.వి.యస్ ఎక్స్‌యల్ సూపర్:
టి.వి.యస్ ఎక్స్‌యల్ సూపర్ ద్విచక్ర వాహనాలు గత ఏడాది సెప్టెంబర్ నెలలో 69,233 యూనిట్లు అమ్మగా 2015 సెప్టెంబర్‌లో 54,559యూనిట్లను మాత్రమే అమ్మింది. అయితే దీని వృద్ధి -21.1 శాతంగా నమోదు అయ్యింది.
ఆన్-రోడ్ ధర రూ. 35,990.

8. హీరో గ్లామర్:
గ్లామర్ గత ఏడాది ఇదే నెలలో 51,831 యూనిట్లు అమ్మకాలు జరిపి పదవ స్థానంలో ఉండేది. ఇప్పుడు 55,793 బైక్‌లను అమ్మి ఎనిమిదవ స్థానంలో ఉంది. దీని వృద్ధి 7.6 గా ఉంది.
ఆన్-రోడ్ ధర రూ. 67,272.

7.బజాజ్ సిటి 100:
బజాజ్ కు చెందిన సిటి 100 మోడల్ 59,406 యూనిట్లను అమ్మి టాప్-10 లో ఏడవ స్థానాన్ని ఆక్రమించుకుంది.
ఆన్-రోడ్ ధర రూ. 42,733.

6. బజాజ్ పల్సర్:
బజాజ్ పల్సర్ గత ఏడాది సెప్టెంబర్‌లో 68,706 యూనిట్లను అమ్మి ఎనిమిదవ స్థానంలో ఉండగా అదే నెల ప్రస్థుత కాలానికి 66,765 యూనిట్లను అమ్మి ఆరవ స్థానంలో ఉంది. ప్రస్తుతం దీని వృద్ధి శాతం -2.8 గా నమోదైంది.
ఆన్-రోడ్ ధర రూ. 76,940.

5.హోండా సిబి షైన్:
గత ఏడాది సెప్టెంబర్‌లో హోండా సిబి షైన్ 77,644 యూనిట్ల అమ్మకాలు జరగగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 69,162 యూనిట్లను మాత్రమే అమ్మింది. అయినప్పటికి టాప్-10లో దీని స్థానం అప్పుడు, ఇప్పుడు రెండు సార్లు ఐదవ స్థానంలో ఉంది.
ఆన్-రోడ్ ధర రూ. 67,856.

4. హీరో హెచ్.ఎఫ్ డీలక్స్:
హెచ్.ఎఫ్ డీలక్స్ 2015 సెప్టెంబర్‍లో 101,579 యూనిట్లు అమ్మాకాలు జరిపింది. ఇదే నెల గత ఏడాదిన 104,250 యూనిట్లను అమ్మింది. దీని అమ్మకా వృద్ధి శాతం -2.5 గా ఉంది. గత ఏడాది కూడా హెచ్.ఎఫ్ డీలక్స్ ఇదే స్థానంలో ఉంది.
ఆన్-రోడ్ ధర రూ. 48,220.

3. హీరో ప్యాసన్:
హీరో తన ప్యాసన్ మోడల్ మోటార్ సైకిళ్లను 2015 సెప్టెంబర్‌లో 108,395 యూనిట్ల అమ్మకాలు సాగించింది. గత ఏడాది ఇదే నెలలో 107,239 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అయితే అమ్మకాల పరంగా దీని వృద్ది శాతం 1 గా నమోదయ్యింది.
ఆన్-రోడ్ ధర రూ. 58,316.

2.హోండా ఆక్టివా :
స్కూటర్ల నుండి వచ్చిన హోండా ఆక్టివా మాత్రం ఈ నెలలో భారీ అమ్మకాలు నమోదు చేసుకుంది. 2015 సెప్టెంబర్ నెలలో 229,382 యూనిట్లను అమ్మేసింది, గత ఏడాది ఇదే నెలలో 210,797 అమ్మకాలు జరిపింది. దీని వృద్ధి 8.8 శాతంగా నమోదు అయ్యింది.
ఆన్-రోడ్ ధర రూ. 60,781.

1. హీరో స్ల్పెండర్:
హీరో కూడా గత ఏడాది కన్నా ఈ ఏడాది ఊహించని ఫలితాలను రికార్డు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 234,844 యూనిట్లు అమ్మగా ఈ సంవత్సరం ఏకంగా 243,188 యూనిట్లను అమ్మింది. దీని వృద్ధి శాతం 3.5 గా నమోదయ్యింది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తరువాత స్లైడర్‌లో మీ కోసం.
ఆన్-రోడ్ ధర రూ. 54,650.

- సెప్టెంబర్ లో అత్యధికంగా అమ్ముడైన పది కార్లు అందులో మీ కారు ఉందా ?
- యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం
- హోండాకు పోటిగా హీరో స్ల్పెండర్ ప్రొ: ఎందుకు, ఏమైంది?


Click it and Unblock the Notifications








