బిఎమ్‌డబ్ల్యూ మరియు టి.వి.యస్ భాగస్వామ్యంతో కొత్త బైక్
బిఎమ్‌డబ్ల్యూ మోటోర్యాడ్ మరియు టి.వి.యస్ భాగస్వామ్యంతో బాగా అభివృద్ది చెందుతున్న మార్కెట్లకు కొత్త మోటార్ సైకిళ్లు నిర్మించాలనే ఒక వ్యూహాత్మక కూటమిలో ఉన్నాయి. జర్మనికి చెందిన తయారిదారులు స్టంట్ జి 310 కాన్సెప్ట్ మోడల్‌ను అందివ్వనున్నారు.
ఈ స్టంట్ మోటర్ సైకిల్‌ను క్రిస్ పెఫ్ఫర్, ఫోర్-టైమ్ వరల్డ్, యూరోపియన్ స్టంట్ రైడింగ్ చాంపియన్ వారు అభివృద్ది పరిచారు. మరియు దీని దక్షిణ అమెరికా యొక్క అతి పెద్ద మోటారి సైకిల్ ప్రదర్శనలో దీనిని రంగప్రవేశానికి భారీగా పథకం వేస్తున్నారు.
బిఎమ్‌డబ్ల్యూ మోటోర్యాడ్ మరియు టి.వి.యస్ కు చెందిన కొత్త బైక్ గురించి మరింత సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా...

క్రిస్ పెఫ్ఫర్ దీని గురించి వివరిస్తూ స్టంట్ రైడింగ్ ఒక డిమాండింగ్ స్పోర్ట్ బైక్ మరియు ప్రతి ఒక్కరికి అవసరమయ్యే కాంపాక్ట్ బైక్ అని చెప్పారు.

ప్రస్తుతం ఇంజన్ గురించి ఏవిధమైన సమాచారం లేదు అయితే ఇందులో సింగల్ సిలిండర్ మరియు 310 సీసీ ఇంజన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జి 310 కాన్సెప్ట్ దశలో ఉన్నట్లు సమాచారం. ప్రతి కోణం నుండి చూస్తే దీని పదునైన డిజైన్స్ కనపడుతాయి, బిఎమ్‌డబ్ల్యూ మరియు టి.వి.యస్ స్వయం నిర్ణయంతో మరిన్ని అంశాలతో దీనికి రూపకల్పన చేసి ముందుకు తీసుకురాగలరు.

మొత్తానికి బిఎమ్‌డబ్ల్యూ మోటోర్యాడ్ మరియు టి.వి.యస్ సంయుక్తంగా 2016 వీటిని భారతమార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

ముఖ్యంగా రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. టి.వి.యస్ బగ్గింగ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ బ్యాడ్జెస్.

ఈ రెండు బైక్ లు అత్యంత సమర్థవంతమైన కెటిఎమ్ డ్యూక్390 మోడల్ కి గట్టి పోటిగా రానుంది.

టి.వి.యస్ బగ్గింగ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ బ్యాడ్జెస్ బైక్‌లు త్వరలో బజాజ్ నుండి సి.యస్ 400 కాన్సెప్ట్‌తో రానున్న అతిపెద్ద మోటార్ సైకిల్ కు ఇవి రెండు మంచి పోటిగా నిలువనున్నాయి.


Click it and Unblock the Notifications








