హోండా యాక్టివాకు చెక్ పెట్టేందుకు వస్తున్న హీరో డ్యాష్

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన సంవత్సరం నవంబర్ నెలలో ఆవిష్కరించిన 5 సరికొత్త ఉత్పత్తులలో ఒకటైన హీరో డ్యాష్ 110సీసీ స్కూటర్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, హీరో మోటోకార్ప్ ఇప్పటికే తమ గుర్గావ్ ప్లాంట్‌లో డ్యాష్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ వెల్లడించిన వివరాల ప్రకారం, హీరో డ్యాష్ స్కూటర్‌లో కొత్త 111సీసీ, ఫోర్-స్ట్రోక్, ఫోర్స్-ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు ఈ ఇంజన్ గరిష్టంగా 8.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హోండా అందిస్తున్న 109.2సీసీ యాక్టివా స్కూటర్ కన్నా హీరో డ్యాష్ స్కూటర్ 0.5 బిహెచ్‌పిల శక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

Hero Dash 110cc Scooter

సరికొత్త డిజైన్‌తో వస్తున్న హీరో డ్యాష్ స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, ఈ-కోడ్ కీ, డిజిటల్ అనలాగ్ కన్సోల్, ట్యూబ్‌లెస్ టైర్స్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్, టెయిల్ మౌంటెడ్ ఫ్యూయెల్ లిడ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, యూఎస్‌బి మొబైల్ చార్జింగ్, బూట్ లైట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, డ్యూయెల్ టోన్ మిర్రర్స్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, March 13, 2015, 10:37 [IST]
English summary
India’s largest two-wheeler manufacturer, Hero MotoCorp is planing to launch the much awaited 110cc Dash scooter soon. According to sources the company has started producing the Dash scooter at its Gurgaon plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+