రాయల్ ఎన్ఫీల్డ్ వర్సెస్ బజాజ్ అవెంజర్ : ఇందులో దేనికి మీ ఓటు !!
ప్రస్తుతం భారతదేశపు ఆటోమొబైల్ మార్కెట్లో వివిధ రకాల కార్ల మోడళ్ల మీద మాత్రమే పోటీ ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఆలోచన మారింది. ఎందుకంటే ద్విచక్ర వాహనాల మధ్య కూడా తీవ్ర పోటి నెలకొంది. అందులో 200సీసీ నుండి 400సీసీ మధ్య గల టూవీలర్ల మధ్య అయితే మరీ ఎక్కువగా ఉంది.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ట్రక్‌ను కొనుగోలు చేసిన మలేషియా సుల్తాన్
ప్రస్తుతం విడుదలైన బజాజ్ అవెంజర్ యొక్క క్రూయిజ్ మోడల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ను పూర్తిగా డామినేట్ చేస్తోంది. అందుకోసం రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ మరియు బజాజ్ అవెంజర్ క్రూయిస్ 200 మోడళ్ల మద్య గల వ్యత్యాసాలను మీ కోసం ప్రత్యేకంగా క్రింది స్లైడర్‌లో అందించాము. వీటిలో ఏది ఉత్తమమైనదో మీరే నిర్ణయించండి.

1.ధర
- రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 ధర దాదాపుగా రూ. 1,48 లక్షలు ఆన్-రోడ్ ధర, (డిల్లీ).
- బజాజ్ అవెంబర్ క్యూయిజ్ 220 ధర దాదాపుగా 92,000 రుపాయలు ఆన్ -రోడ్ ధర, (డిల్లీ).
- ఇందులో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని ఫీచర్లు ఉన్నాయి అవి.
- సెమి-డిజిటల్ మీటర్స్
- బ్లూ బ్యాక్‌లైట్ డిస్ల్పే
- ముందు మరియు వెనుకవైపున డిస్క్‌బ్రేక్‌లు ఉన్నాయి.
- ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
- మరియు ఇందులో ఉన్న 20 లీటర్ల ఇంధన ట్యాంక్ మీరు లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
- సెమి డిజిటల్ మీటర్
- వార్నింగ్ ల్యాంప్స్
- ఫ్యూయల్ గేజ్ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంటుంది.
- ఇందులో ఉన్న సీటు చాలా క్రిందకు మరియు హ్యీండిల్ బార్ పొడవుగా పైకి తయారుచేయబడి ఉంటుంది
- ముందు వైపున డిస్క్ బ్రేక్‌లు మరియు
- వెనుక వైపున డ్రమ్ బ్రేక్‌లు కలవు.

2. డిజైన్
థండర్‍బర్డ్:
ఈ రాయల్‍ఎన్ఫీల్డ్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ మరియు దీని హ్యాండిల్ బార్ ఎంతో పొడవుగా డిజైన్ చేయబడి ఉంటుంది. దీని యొక్క సీటు ఎంతో సౌకర్యంతవంతంగా డిజైన్ చేయబడి ఉంది. మరియు మీరు దీని ఫ్రంట్‌ఫోర్క్‌ని గమనించినట్లయితే ఎంతో పొడవుగా ఉంటుంది. దీని వలన మంచి రైడింగ్ అనుభుతిని పొందవచ్చు.

3. అవెంజర్ :
అవెంజర్ క్యూయిజ్ 220 స్టైల్ పరంగా తన మునుపటి మోడల్ కన్నా కొన్ని కొత్త మెరుగులు దిద్దుకుని మీ ముందుకు వచ్చింది. అందులో పెద్దాగా ఉన్న హ్యాండిల్ బార్ మరియు కొత్త రకం పెంయిటింగ్ ఉన్నాయి. అయితే మునుపటిలా కాళ్లను పొడవుగా ఉంచుకుని డ్రైవ్ చేయవలసిన అవసరం లేకుండా దీనిని రూపొందించారు.

4. ఫీచర్స్
థండర్బర్డ్:

5. అవెంజర్ :

6. ఇంజన్ వివరాలు
థండర్‌బర్డ్ :
థండర్‌బర్డ్ 350 బైక్‌లో 346సీసీ గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూలింగ్ ఇంజన్ కలదు. ఇది 19.8 బిహెచ్‌పి మరియు 28 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

7. అవెంజర్ :
సరి కొత్త క్రూయిజ్ బైక్ లో 219.9సీసీ గల సిగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది 18.7 బిహెచ్‌పి మరియు 17.5ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు.

8. ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్
థండర్‌బర్డ్ :
రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ బైక్ లో గల ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. ఇది మీకు లీటర్‌కు 51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని బరువు 192 కిలోలు.

9.అవెంజర్ :
అవెంజర్ క్రూయిజ్220 లో గల ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో నిర్మితమై ఉంది. ఇది లీటర్ కు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ అవంజర్ యొక్క మొత్తం బరువు. 155 కిలోలు.

10. రైడింగ్ మరియు హ్యాండ్లింగ్
బజాజ్ క్రూయిజ్ తో పోల్చుకుంటే థండర్‌బర్డ్ ఎంతో ఎత్తుగా ఉంటుంది. అయితే క్రూయిజ్‌కు ఉండవలసిన బరువు, టార్క్, మరియు సీటింగ్ పొజిషన్ అన్ని కూడా సరిపోయే విధంగా తయారు చేశారు.
అయితే ఉత్పత్తి చేసే పవర్ విషయంలో థండర్‌బర్డ్ ముందు ఉంది. దీని విడుదల చేసే అత్యుత్తమమైన పవర్ హైవే మీద చక్కటి పని తీరును కనబరుస్తుంది.

11. తీర్పు :
అయితే డబ్బును ఏ టూవీలర్‌ను కొనడానికి ఉపయోగించాలనుకుంటున్నారు. తక్కువ బరువున్న బైక్ కావాలంటే అవెంజర్ క్రూయిజ్ 220 ని ఎంచుకోండి. ఇలా కాకుండా బరువు ఎక్కువగా ఉండాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ను తీసుకోండి.

వివిద రకాల ద్విచక్ర వాహనాల గురించి తెలుసుకోండి.
మహీంద్ర మోజో కొత్త బైక్: ధర, స్పెసిఫికేషన్లు కోసం
విమానాన్ని తయారు చేసిన ఒక సాధారణ పల్లెకు చెందిన వ్యక్తి


Click it and Unblock the Notifications








