బెంగళూరును అతిపెద్ద మార్కెట్‌గా చేసుకున్న డీఎస్‌కే బెనెలి
భారత్ ద్వి-చక్రవాహనా రంగంలో ముందంజలో ఉంది. సరికొత్త సూపర్ బైక్‌ల ఆవిష్కరణలు జరిగాయి. ఈ బైక్‌లు ప్రజాదరణను పొందుతున్నాయి.
కొన్ని ప్రీమియం మోటార్ సైకిళ్ల బ్రాండ్‌లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టాయి. డీఎస్‌కే హోసంగ్, త్రింప్, హార్లే-డేవిడ్సన్, డుకాటి మరిన్ని బ్రాండ్‌లు ఉన్నాయి.
డీఎస్‌కే బెనెలి భారత మార్కెట్లోకి అడుగిడిన మూడు నెలల్లోనే బెంగళూరులో తన 100వ బైక్‌ను విక్రయించింది.
ఈ వేడుకను జరుపుకునే సందర్భంగా ప్రత్యేక రైడ్‌ను నిర్వహంచింది. ఇందులో డ్రైవ్‌స్పార్క్ పాల్గొనింది. డీఎస్‌కే బెనెలి యొక్క టిఎన్‌టి 600ఐ మోటార్ సైకిల్‍ను రైడ్ చేసేందుకు ఇచ్చారు. అవి మా మనసులను ఆకట్టుకున్నాయి.
మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం..............

డీఎస్‌కే బెనెలి బెంగళూరు వేగంగా విక్రయాలు జరుపుతున్న సూపర్ బైక్ తయారీ సంస్థ. ఇది ఇటాలియన్ బ్రాండ్‌ను తీసుకొచ్చిన సంస్థ.
భారత మార్కెట్లోకి అడుగిడిన మూడు నెలల్లోనే బెంగళూరులో తన 100వ బైక్‌ను విక్రయించింది.

అనేక మంది డీఎస్‌కే బెనెలి నిర్వహించిన వేడుకలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. రైడర్స్ తమ టిఎన్‌టి 899, టిఎన్‌టి 1130, టిఎన్‌టి 600 జీటీ, టిఎన్‌టి 600ఐ మరియు టిఎన్‌టి 300 సూపర్ బైక్‍లను తీసుకొచ్చారు.

ఫ్లాగ్ ఆఫ్ సందర్భంగా డీఎస్‌కే మోటో వీల్స్ ఛైర్మెన్ శిరీష్ కులకర్ణి మాట్లాడుతూ..... " భారత మార్కెట్లోకి అడుగిడిన మూడు నెలల్లోనే బెంగళూరులో 100వ బైక్‌ను విక్రయించడం చాలా గర్వకారణం. బెంగళూరు మా బైక్‌ల విక్రయాల్లో అతి పెద్ద మార్కెట్‌గా తయారైంది " అని తెలిపారు.

డీఎస్‌కే బెనెలి టిఎన్‍టి 600ఐ స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 600 సీసీ, 4-సిలిండర్, లిక్విడ్ కూల్డ్.
హార్స్ : పవర్ 83.87.
టార్క్ : 54.6ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 6-స్పీడ్.

డీఎస్‌కే బెనెలి 100వ బైక్ ఓనర్‌కు డీఎస్‌కే మోటో వీల్స్ ఛైర్మెన్ శిరీష్ కులకర్ణి బైక్ కీస్‌ను అందజేశారు. అది యాజమాన్యానికి, 100వ బైక్ ఓనర్‌కు ఒక ప్రత్యేకమైన సందర్భం.

డీఎస్‌కే బెనెలి టిఎన్‍టి 600ఐ ధర రూ. 5,24,000 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా ఉంది.


Click it and Unblock the Notifications








