మార్చ్ 19, 2015న డిఎస్‌కె బెనెల్లీ బైక్స్ విడుదల
ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ, వచ్చే నెలలో తమ బైక్‌లను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గోవాలో జరిగిన 3వ ఎడిషన్ ఇండియా బైక్ 2015లో పాల్గొన్న బెనెల్లీ తమ ప్రోడక్ట్ లాంచ్ ప్లాన్స్ గురించి వెల్లడి చేసింది.
మార్చ్ 19, 2015వ తేదీన కొన్ని మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయనున్న బెనెల్లీ తెలిపింది. గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో పూనేకి చెందిన డిఎస్‌కె మోటోవీల్స్‌తో బెనెల్లీ భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసినదే.

గోవాలో జరిగిన 2015 ఇండియా బైక్ వీక్‌లో తమ మొత్తం ఉత్పత్తుల శ్రేణిని బెనెల్లీ ప్రదర్శనకు ఉంచింది. డిఎస్‌కె బెనెల్లీ మొత్తం ఎనిమిది మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది.
బెనెల్లీ ప్రదర్శించిన బైక్‌లలో ఇన్-లైన్ 2-సిలిండర్ 300సీసీ టిఎన్‌టి 300, ఇన్-లైన్ 4-సిలిండర్ 600సీసీ టిఎన్‌టి 600, ఇన్-లైన్ 4-సిలిండర్ 600సీసీ టిఎన్‌టి 600 జిటి, ఇన్-లైన్ 3-సిలిండర్ 898సీసీ టిఎన్‌టి 899, ఇన్-లైన్ 3-సిలిండర్ 1131సీసీ టిఎన్‌టి 1130 మోడళ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నాయి.



Click it and Unblock the Notifications








