డిసెంబర్ 18 న విడుదల కానున్న డిఎస్‌కె బెనెల్లీ టియన్‌టి 25
డిఎస్‌కె బినెల్లీ తన టియన్‌టి 25 మోటార్ సైకిల్‌ను ఎప్పుడు విడుదల చేయాలో అని ఒక నిర్ధారణకు వచ్చింది. బెనెల్లీ ఈ మోటార్ సైకిల్ ను భారతీయ మార్కెట్లోకి డిసెంబర్ 18, 2015 న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. బెనెల్లీ భారతీయ మార్కెట్లోకి ఇంకా రెండు మోడల్స్‌ను అందిస్తామని గతంలో చెప్పింది మరి ఎప్పుడు విడుదల చేస్తుందో ఏమో ?
మరింత చదవండి: కస్టమైజ్డ్ అల్ట్రా బైక్: దీని అత్యధిక వేగం 340 కి.మీ లు...!
అయితే ఈ టియన్‌టి 25 మోడల్ బైకును 2015 లో జరిగే ఇండియా బైక్ వీక్‌లో విడుదల చేయనుంది. మరి ఈ టియన్‌టి 25 టూ వీలర్ గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇంజన్
ఈ సరికొత్త బెనెల్లీ టియన్‌టి 25 బైకులో అత్యంత శక్తివంతమైన 249.2సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

పవర్
ఈ టియన్‌టి 25 మోడల్ టూ వీలర్‌లో గల ఇంజన్ దాదాపుగా 24.15బిహెచ్‌పి పవర్ మరియు 21 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం
డిఎస్‌కె బెనెల్లీ టియన్‌టి 25 అత్యధికంగా గంటకు 129 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీని కోసం ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కల్పించారు.

భద్రత
ఇందులో భద్రత దృష్ట్యా యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఎబియస్) ను ఆప్షనల్ గా కల్పించారు. ఒక వేళ యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వద్దు అనుకునే వారికి ఎబియస్ లేకుండా అందిస్తారు.

డిఎస్‌కె బెనెల్లీ మరిన్ని మోడల్స్
బెనెల్లీ ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉంచిన మోడల్స్
- టియన్‌టి 300
- టియన్‌టి 600ఐ
- టియన్‌టి 600 జిటి
- టియన్‌టి 899
- టియన్‌టి ఆర్ మరియు ప్రస్తుతం విడుదలకు సిద్దమైన టియన్‌టి 25
- హోండా నుండి కొత్త సిటి అడ్వెంచర్ కాన్సెప్ట్ స్కూటర్
- హోండా నుండి సిబియస్ ఐఎక్స్50 కాన్సెప్ట్ బైక్ విడుదల
- యమహా నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్

టియన్‌టి 25 ధర
డిఎస్‌కె బెనెల్లీ టియన్‌టి ధర దాదాపుగా రూ. 1.5 లక్షల నుండి 1.7 లక్షలు ఎక్స్-షోరూమ్ మధ్య ఉండవచ్చు.

పోటి
డియస్‌కె బినెల్లీ వారి టియన్‌టి 25 మోడల్ బైక్ మార్కెట్లోకి విడుదల అయితే క్రింది వాటితో పోటి పడనుంది. కెటియమ్ డ్యూక్ 200, హోండా సిబిఆర్250ఆర్ మరియు హీరో మోటోకార్ప్ వారి కరిజ్మా. హోయసంగ్ వారు త్వరలో విడుదల చేయనున్న జిడి250ఎన్ మరియ టివియస్ మోటార్స్ వారి అపాచే 200 లకు కూడా ఇది పోటికి సిద్దమైపోయింది.



Click it and Unblock the Notifications








