మొట్టమొదటి 125సీసీ స్కూటర్‌ను పరిచయం చేసిన కవాసకి
కవసాకి అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది స్పోర్ట్స్ బైకులు. అంటే కవసాకి దాదాపుగా తన అన్ని మోడల్స్‌లో కూడా స్పోర్ట్స్ బైకులు ఉంటాయి. ఇక మీద మనం ఈ ఆలోనను మార్చుకోవాలి ఎందుకంటారా. ఇప్పడు కవసాకి తన మొట్టమొదటి 125సీసీ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read: సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్
కవసాకి మోటార్స్ 2015 ఎకిమా మోటార్ షో అదేనండి మిలాన్ మోటార్ షోలో తన ప్రప్రథమ 125సీసీ గల స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్ గురించి మరింత సమాచారం క్రింది గల స్లైడర్‌లో ఉంది ఓ లుక్కేసుకోండి.

కవసాకి జె125
కవసాకి తన 125సీసీ స్కూటర్‌కు జె125 అని పేరు పెట్టింది. నిజంగా ఇది ఇతర బ్రాండ్‌కు చెందిన స్కూటర్ దాని పేరు డౌన్‌టౌన్ 300ఐ

రీమోడల్
తైవాన్‌కు చెందిన కెవైయమ్‌సిఒ (KYMCO) టువీలర్ తయారీదారులు దీనిని అభివృద్ది చేశారు. అయితే ఇప్పడు కవసాకి ఆ మోడల్ పేరును పూర్తిగా మార్చేసి తిరిగి డిజైన్ చేసి కవసాకి జె125 గా మవ ముందుకు తీసుకువస్తోంది.

ఇంజన్
కవసాకి జె125 స్కూటర్‌లో 125సీసీ గల 4-వాల్వ్ సిగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. మరియు దీని ఇంజన్ లిక్విడ్ ద్వారా చల్లబడుతుంది.

పవర్
ఈ సరికొత్త కవసాకి జె125 స్కూటర్‌లో గల ఇంజన్ 13.8బిహెచ్‌పి పవర్ మరియు 11.5 అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇది అత్యంత బరువైనది కూడా దీని మొత్తం బరువు 182 కిలోలు.

ట్రాన్స్‌మిషన్
ఇంజన్ నుండి విడుదలయ్యే పవర్‌ను ఇందులో గల సివిటి ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ వెనుక చక్రానికి అందిస్తుంది. వెనుకవైపున అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు గల రెండు ప్రిలోడెడ్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

భద్రత
182 కిలోలు గల ఈ జె125 స్కూటర్‌ను మరియు దీని వేగాన్ని ఇందలో గల డిస్క్ బ్రేక్‌లు అతి సునాయాసంగా అదుపులోకి తీసుకు వస్తుంది. ఈ స్కూటర్‌ోలో ముందు వైపున 260యమ్‌యమ్ గల డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపున 240 యమ్‌యమ్ గల డిస్క్ బ్రేక్‌లను అందించారు. మరియు ఇందులో ఆప్షనల్‌గా యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.

ఫీచర్స్
ఇందులో గల ఫీచర్లు:
- టు-టోన్ సిల్వర్ సీటు
- యల్‌ఇడి టెయిల్ ల్యాంప్
- సీటు క్రింద స్టోరేజ్ సౌకర్యం
- పూర్తిగా ఒక హెల్మెట్‌ను స్టోర్ చేసుకునే అవకాశం
- 12 వోల్టుల ఛార్జింగ్ సాకెట్
- లగేజ్ తగిలించుకోవడానికి కార్గో హుక్స్

మిలాన్ మోటార్ షోలో జరుగుతున్న టూవీలర్స్ ప్రదర్శనలో గల వివిద రకాల బైకుల గురించి తెలుసుకోండి. మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 2015 మిలాన్ మోటార్ షో


Click it and Unblock the Notifications








