డౌన్‌పేమెంట్ కట్టకుండానే ఫోర్డ్ ఫిగోని తీసుకెళ్లండి!
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, భారత్‌లో తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కస్టమర్ల కోసం ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను పరిచయం చేసింది. అసలు డౌన్‌పేమెంట్ కట్టాల్సిన అవసరం లేకుండా పూర్తిగా 100 శాతం రుణాన్ని ఆఫర్ చేసే ఓ కొత్త స్కీమ్‌ను ఫోర్డ్ అందిస్తోంది.
జీరో డౌన్‌పేమెంట్ స్కీమ్ పేరిట ఫోర్డ్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి లక్షపై కేవలం రూ.1671 ఈఎమ్ఐకే (వేరియంట్‌ను బట్టి ఈఎమ్ఐ మారుతుంది) రుణాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను అధీకృత ఫోర్డ్ ఇండియా డీలరను సంప్రదించి తెలుసుకోవచ్చు.

ఫోర్డ్ ఫిగో ప్రారంభ వేరియంట్ (ఎల్ఎక్స్ఐ) ధర రూ.4.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ.58,000 వరకూ ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఎంపిక చేసిన యాక్ససరీలపై 15 శాతం రాయితీ కూడా పొందవచ్చు.
ఫోర్డ్ ఇండియా త్వరలోనే కొత్త తమ నెక్స్ట్ జనరేషన్ ఫిగో మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, ప్రస్తుత తరం ఫిగో మోడల్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.
మార్కెట్లో లభిస్తున్న ఫోర్డ్ ఫిగో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులోని 1.2 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 70 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.4 లీటర్ డ్యూరాటార్క్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








