200సీసీ, 250సీసీ ఇంజన్ ఆప్షన్లతో రానున్న హీరో ఇంపల్స్

By Ravi

హీరో మోటోకార్ప్ గడచిన 2011వ సంవత్సరంలో భారత్‌లో విడుదల చేసిన హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్ మీకు గుర్తుందా..? ఇటు ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం అటు సిటీ రైడింగ్ ప్రయోజనాల కోసం అనువుగా ఉండేలా డిజైన్ చేసిన ఈ డ్యూయెల్ పర్పస్ మోటార్‌సైకిల్ మార్కెట్లో ఆశించిన సక్సెస్‌ను సాధించలేకపోయింది.

ఆఫ్-రోడింగ్ లుక్‌ను కలిగి ఉండే ఈ బైక్‌లోని 150సీసీ ఇంజన్ పెర్ఫార్మెన్స్ కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌లో 150 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 13.8 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను మాత్రమే విడుదల చేసేది.

ఆఫ్-రోడింగ్ ప్రియులకు ఈ పెర్ఫార్మెన్స్ సరిపోలేదేమో అందుకే హీరో మోటోకార్ప్ 2012లో ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, హీరో మోటోకార్ప్ తమ విశిష్టమైన ఉత్పత్తిని కోల్పోవటం ఇష్టం లేక ఇందులో మరింత శక్తివంతమైన ఇంజన్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Hero MotoCorp To Launch 200-250cc Impulse

కొత్త హీరో మోటోకార్ప్ 200సీసీ, 250సీసీ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే ఇంపల్స్ 200/250 బ్రాండ్ పేర్లను హీరో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. 250సీసీ వెర్షన్ హీరో ఇంపల్స్‌లో కంపెనీ మరికొద్ది నెలల్లో విడుదల చేయనున్న హీరో హెచ్ఎక్స్250ఆర్‌లో ఉపయోగించనున్న ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే.. 200సీసీ వెర్షన్ హీరో ఇంపల్స్‌లో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేస్తున్న 200సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ 200సీసీ ఇంజన్‌ను ఇంపల్స్‌తో పాటుగా మరొక సరికొత్త హీరో బైక్‌లో ఉపయోగించనున్నారట. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, March 20, 2015, 12:46 [IST]
English summary
According to sources, Hero MotoCorp is now working on a new bigger engine capacity Impulse bikes. Recently the company has registered the Impulse 200/250 brand name under its name.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+