హోండా కు పోటిగా హీరో స్ల్పెండర్ ప్రొ: ఎందుకు, ఏమైంది?
భారత దేశపు దిగ్గజ ద్విచక్ర వాహన తయారి సంస్థ తమ స్ల్పెండర్ ప్రొ మోడల్ కు మరిన్ని సొబగులు జోడించి తమకు నిరంతరం ప్రత్యర్థిగా ఉన్న హోండాకు పోటిగా దీనిని విడుదల చేయనున్నారు.
గతంలో హీరో మోటో కార్ప్ సంస్థ విపరీతమైన అమ్మకాలను సాధించింది. 2010 లో హీరో మోటో కార్ప్ ఈ మోటార్ సైకిల్‌ని ఆధునీకరించి స్ల్పెండర్ ప్రో గా నామకరణం చేసి మార్కెట్లోకి విడుదల చేశారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం
హీరో మోటో కార్ప్ స్ల్పెండర్ ప్రో గురించి మరింత సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

1,00,000
ఇదేం నెంబరు అనుకుంటున్నారా హీరో మోటో కార్ప్ కేవలం ఒక సంవత్సరంలో 1,00,000 అమ్మకాలను సాధించింది. దీని బట్టి భారతీయులు దీనిని ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తోంది.
Also Read: లిమిటెడ్ ఎడిషన్‌గా ఐదు ఉత్పత్తులను విడుదల చేసిన టాటా

నమ్మకం :
హీరో మోటో కార్ప్ భారత దేశంలోని ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థనంలో ఉంది. భారతీయులకు ఈ సంస్థ మన్నికైన మరియు సరసమైన ద్విచక్ర వాహనాలను అందింస్తూ వచ్చింది.

హోండా :
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారి సంస్థ హోండా కూడా ప్రస్తుతం చాలా కొత్తవల మోడళ్ళను ప్రవేశ పెట్టింది అందులో హోండా లివో ఒకటి. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువతని ఆకర్షించింది.

శుభ వార్త :
హీరో మోటో కార్ప్ వారు దేశ వ్యాప్తంగా ఉన్న స్టోర్‌లకు నిజంగానే ఒక శుభ వార్త అందిచింది. వారి అన్ని ద్విచక్రవాహనాల మీద కేవలం 200 నుండి 250 రుపాయలు మాత్రమే పెంచారు. అతి తక్కువగా ధర పెంచడం అనేది సామాన్య విషయం కాదు.

లభిస్తున్న మోడల్స్ :
హీరో మోటో కార్ప్ ప్రస్తుతం, స్ల్పెండర్ ప్రో, స్ల్పెండర్ ప్రో క్లాసిక్, సూపర్ స్ల్పెండర్, సూపర్ స్ల్పెండర్ ప్లస్ మరియు స్ల్పెండర్ ఐ స్మార్ట్ ద్విచక్ర వాహనాలను దేశ వ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంచింది.

ధర :
అత్యంత మన్నికైన హీరో స్ల్పెండర్ ప్రో మోడల్ యొక్క ధర 46,537 రుపాయలు. (ఎక్స్-షోరూమ్, ముంబాయ్).

స్కూటర్స్ :
ఈ మధ్యనే హీరో మోటో కార్ప్ రెండు కొత్త స్కూటర్‌లను విడుదల చేసింది. అవి మాయెస్ట్రో ఎడ్జ్ మరియు డ్యూయెట్, ఈ రెండు స్కూటర్లు తమను దేశంలో ఉత్తమ స్కూటర్లు తయారి దారులుగా ఎదగడానికి దోహదపడతాయన్నారు.

మాయెస్ట్రో ఎడ్జ్ :
హీరో మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్ దేశవ్యాప్తంగా అక్టోబర్ 13,2015 న విడుదల కానుంది. అయితే డ్యూయెట్ ఇంకా విడుదల కాలేదు. ఈ సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

తీర్పు:
త్వరలో విడుదల కానున్న స్కూటర్లు మరియు ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న బైక్‌ల నేపథ్యంలో హీరో మోటో కార్ప్ హోండా తో గట్టిగానే తలపడనుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.
Also Read: లండన్‌లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్స్ కారు: డిసి అవంతి


Click it and Unblock the Notifications








