హోండా సిబి హార్నెట్ 160ఆర్ యాప్ ను ఏడు రోజుల్లో 10,000 బుకింగ్స్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ మధ్యనే తమ సరికొత్త హోండా సిబి హార్నెట్ 160ఆర్ టూ వీలర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే ఈ బైకును బుక్ చేసుకోవడాని హోండా వారు ఒక యాప్ ను రూపొందించారు. దీనిని విడుదల చేసిన ఏడు రోజుల్లేనే దాదాపుగా 10,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
Also Read: భారతీయ టూవీలర్ మార్కెట్లోకి విడుదలైన బెనెల్లీ టియన్‌టి25 ధర రూ. 1.68 లక్షలు
విడుదల సమయంలో దీనిని కేవలం 21 రీజియన్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న విధానం చూసి. హోండా వారు దీని పాపులారిటికి అనుగుణంగా ఈ హార్నెట్ ను 53 నగరాలలో అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read: కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్
హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకు కావాలనుకునే వారు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ముందుగా దీనిని డౌన్‌లోడ్ చేసుకుని ఈ యాప్ అడిగే వివరాలను నమోదుచేసి 5,000 రుపాయలతో ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.
also Read: శ్వేత విప్లవం సృష్ఠించనున్న బజాజ్ పల్సర్ ఆర్‌యస్20
ఈ హోండా సిబి హార్నెట్ 160ఆర్ రెండు వేరియంట్లలో లభించును. సింగల్ డిస్క్ బ్రేక్ గల హార్నెట్ ధర రూ. 79,900 మరియు రెండు చక్రాలకు డస్క్ బ్రేక్‌లు గల వేరియంట్ ధర రూ. 84,400 ఎక్స్-షో రూమ్ ఢిల్లీగా ఉన్నాయి. మరియు ఇది ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.



Click it and Unblock the Notifications








