కేవలం 5,000 రుపాయలతో హోండా సిబి హార్నెట్ బుకింగ్
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ భారతీయ మార్కెట్లోకి సరికొత్త సిబి హార్నెట్ 160 ఆర్ టూ వీలర్‌ను విడుదల చేశారు. ఈ సంధర్బంగా దీనికి భారత దేశపు యొక్క స్ట్రీట్ స్పోర్ట్స్ బైక్ అని కూడా సంభోదించారు. అంతే కాకుండా ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి హోండా వారు ఈ టూ వీలర్ పేరు మీద ఒక యాప్ ను కూడా రూపొందించారు.
హోండా వారి సిబి హార్నెట్ 160 ఆర్ గురించి మరింత సమాచారం క్రింది కథనంలో

డిజైన్
హోండా సిబి హార్నెట్ 160 ఆర్ టూ వీలర్‍ను విభిమన్నంగా డిజైన్ చేశారు. ఇందులోని చాలా వరకు భాగాలు పదునుగా మరియు కండలు తిరిగిన విధంగా డజైన్ చేశారు. ఇందులోని ఫ్యూయల్ ట్యాంక్, హెడ్ లైట్స్ వంటి వాటిని ఎంతో కొత్తగా డిజైన్ చేశారు. వీటికి అదనంగా X ఆకారంలో గల టెయిల్ ల్యాంప్స్, 5-స్పోక్స్ గల అల్లాయ్ వీల్స్ మరియు సిల్వర్ తో ఫినిషింగ్ చేయబడిన సైలెన్సర్ కలదు.

ఇంజన్
ఈ హోండా సిబి హార్నెట్ 160 ఆర్ లో 162.7సీసీ గల ఎయిర్ కూల్డ్ సింగల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 15.6బిహెచ్‌పి పవర్ మరియు 14.76 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ కలదు.

భధ్రత
ఇందులో భద్రత కోసం ఇందులో ముందు వైపు కాంబి బ్రేక్ సిస్టమ్ గల రెండు పెటల్ డిస్క్ గల బ్రేక్‌ను అందించారు. అయితే సాధారణ బైకులో కేవలం సింగల్ డిస్క్ మాత్రమే ఉంటుంది.

స్థిరత్వం
ఇందులో స్థిరత్వం పెంచడం కోసం హోండా టూ వీలర్స్ వారు 1,345 ఎమ్ఎమ్ వీల్ బేస్ కల్పించారు మరియు వెనుక వైపున 140ఎమ్ఎమ్ వెడల్పు గల టైరును అమర్చారు.

ధర
హోండా సిబి హార్నెట్ 160 ఆర్ ధర రూ. 79,900 ఎక్స్-షో రూమ్, (ఢిల్లీ) గా ఉంది. కాంబి బ్రేక్స్ గల హార్నెట్ ధర రూ. 84,400 ఎక్స్-షో రూమ్, (ఢిల్లీ) గా నిర్ణయించారు

బుకింగ్
ఈ హార్నెట్ 160 ఆర్ బైకును ముఖ్యంగా యువత మరియు విద్యార్థుల కోసం విడుదల చేసినట్లు తెలిపారు. దీనిని బుక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఈ బైకును 5,000 రుపాయల బుకింగ్ ఫీజుతో బుక్ చేసుకోవచ్చు.

హోండా సిబి హార్నెట్ యాప్
ఈ యాప్‌ను ఫేస్ బుక్ లేదా గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లాగిన అయిన తరువాత మీరు ఈ బైక్‌కు చెందిన సాంకేతిక వివరాలు, ధర, లభించు రంగులు, మైలేజ్, విడుదల చేయు పవర్ వంటి అనేక వివరాలను ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు.

పోటి
ఈ యాప్ ద్వారా మీరు హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైకు కు పోటి పడే ఇతర టూ వీవలర్లు మరియు ఈ సెగ్మెంట్లో పోటి పడే బైకుల యొక్క సాంకేతిక మరియు అన్ని వివరాలను పోల్చవచ్చు.

డీలర్ షిప్ వివరాలు
వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఈ యాప్ ద్వారా అన్ని హోండా డీలర్ షిప్ వివరాలను అందుబాటులో ఉంచారు. వీటితో ప్రతి నగరం లో కూడా వీటి ఆన్-రోడ్ ధరలను కూడా పొందుపరిచారు.

35,000 డౌన్‌లోడ్స్
హోండా వారు ప్రత్యేకంగా ఈ సిబి హార్నెట్ 160 ఆర్ కోసం రూపొందించిన యాప్‌ను దాదాపుగా 35,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొదట్లో వీటిని దేశ వ్యాప్తంగా గల 21 రీజియన్లలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం వీటిని 53 నగరాలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

మీరు కూడా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా ?
మీరు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.దీనిగురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు.


Click it and Unblock the Notifications








