సిబి షైన్ యస్‌పి మోడల్ బైక్‌ను విడుదల చేసిన హోండా మోటార్ సైకిల్స్: ధర, ఫీచర్స్ కోసం...
జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా ఈ 2015 సంవత్సరానికి గాను 15 కొత్త మోడల్స్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పుడు విడుదల చేసిన కొత్త మోటార్ సైకిల్ 14 వ ఉత్పత్తిగా వివరించింది.
Also Read: అత్యంత ఖరీదైన బైక్‌ను విడుదల చేసిన డుకాటి: 400సీసీ స్క్రాంబ్లర్.
హోండా విడుదల చేసిన ఈ బైక్ పేరు సిబి షైన్ యస్‌పి . యస్‌పి అనగా స్మార్ట్ పవర్ అని అర్థం. అయితే ఈ కొత్త బైక్ కు చెందిన ధర, ఫీచర్స్ వంటి మరివన్ని మరిన్ని విషయాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

ఇంజన్
ఈ కొత్త సిబి షైన్ యస్‌పి మోడల్ టూవీలర్‌లో 124.7సీసీ గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది పూర్తిగా ఎయిర్ కూల్డ్ ఇంజన్.

పవర్
స్మార్ట్ పవర్ మోటార్ సైకిల్‌లో గల ఇంజన్ 10.5బిహెచ్‌పి పవర్ మరియు 10.3ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ కలదు.

స్మార్ట్ టెక్నాలజీ
హోండా స్మార్ట్ పవర్ బైకులో ఆటో స్టార్ట్ మరియు స్టాప్ టెక్నాలజీ కలదు. ఇది మీరు బైకును ఎక్కువ సమయం పాటు న్యూట్రల్ ఉంచి ఆన్‌లో పెట్టినట్లయితే ఆటోమెటిక్‌గా మీ బైకును ఆఫ్ చేస్తుంది. దీని వలన పెట్రోల్ వాడకం తగ్గి మైలేజ్ పెరుగుతుంది.

అల్లాయ్ వీల్స్
ఈ స్మార్ట్ బైక్‌లో రెండు చక్రాలు కూడా అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్నాయి. 18-ఇంచుల అల్లాయ్ వీల్స్‌కు ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు.

మైలేజ్
ఇందులో 10.5-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ కలదు. ఈ సరి కొత్త సిబి షైన్ యస్‌పి బైకు లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజ్‍ను ఇస్తుంది.

ఫీచర్స్
- ఎలక్ట్రిక్ స్టార్ట్
- ముందు వైపున టెలిస్కోపిక్ సస్పెన్షన్
- వెనుకవైపున రెండు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్
- అనలాగ్ స్పీడో మీటర్
- బ్లాక్
- అథ్లెటిక్ బ్లూ మెటాలిక్
- జెని గ్రే మెటాలిక్
- పియర్ల్ అమేజింగ్ వైట్
- రెబల్ రెడ్ మెటాలిక్
- డ్రమ్ ధర రూ. 59,900
- డిస్క్ ధర రూ. 62,400
- సిబియస్ ధర రూ. 64,400

లభించు రంగులు
హోండా సిబి షైన్ యస్‌పి ఐదు విభిన్న రంగుల్లో లభించును:

సిబి షైన్ యస్‌పి ధరలు
సరి కొత్త సిబి షైన్ యస్‌పి మూడు వేరియంట్లలో లభించును. వేరియంట్ల వారిగా ధరలను ప్రకటించాము.
గమనిక అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)

మరిన్ని టూవీలర్లుకు చెందిన విశయాలు తెలుసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








