కొత్త రంగులు, కొత్త ధరలతో విడుదల అయిన హోండా సిబి షైన్
మార్కెట్లో కార్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టూ వీలర్లు కూడా ఇదే బాట పడుతున్నాయి. హోండా టూ వీలర్స్ వారు నూతన సంవత్సరం సంధర్భంగా తమ సిబి షైన్ టూ వీలర్లను నాలుగు కొత్త రంగుల్లో విడుదల చేశారు. అంతే కాకుండా వీటి ధరలను కూడా పెంచినట్లు ప్రకటించారు.
హోండా సిబి షైన్ యొక్క ధరలు, లభించు రంగులు మరియు ఇతర స్పెసిఫికేషన్లు గురించి తెలుసుకుందామా ? అయితే క్రింద కథనాలను గమనించండి.

ధరలు
- హోండా సిబి షైన్ సెల్ఫ్-స్టార్ట్ మరియు డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 55,559
- హోండా సిబి షైన్ సెల్ఫ్-స్టార్ట్ మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 57,885
- హోండా సిబి షైన్ సెల్ఫ్-స్టార్ట్ మరియు డిస్క్ బ్రేక్(సిబియస్) వేరియంట్ ధర రూ. 60,808
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) గా ఉన్నాయి.

డిజైన్
వీటి డికాల్స్ అన్నింటికి కూడా పైన చెప్పిన రంగులను వేశారు. అయితే ఇవి చూడటానికి ఎంతో స్టైలిష్ గా మరియు స్పోర్టివ్ గా ఉన్నాయి.

ఫ్రంట్ డిజైన్
దీనిని ముందు భాగాన లైట్ పైన గల డికాల్‌కు బ్లాక్ డిజైన్ కొత్తగా చేశారు. ఈ అప్‌డేటెడ్ సిబి షైన్ లో మాత్రమే ఈ డిజైన్ కల్పించారు. మరియు ఇందులో మరింత నూతనత్వాన్ని జోడించడానికి సరికొత్త టెయిల్ ల్యాంప్స్‌ను అందించారు.

లభించు రంగులు
హోండా వారి సరికొత్త సిబి షైన్ నాలుగు కొత్త రంగుల్లో లభించును:
- ఇంపీరియల్ రెడ్ మెటాలిక్
- మ్యాపిల్ బ్రౌన్ మెటాలిక్
- జెని గ్రే మెటాలిక్
- బ్ల్యాక్

ఇంజన్
ఈ సరికొత్త సిబి షైన్‌లో 125 సీసీ గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ను అందించారు.

శక్తి
ఈ శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 11 బిహెచ్‌పి శక్తిని మరియు 10 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్ బాక్స్
హోండా టూ వీలర్స్ వారు ఇందులో 4-స్పీడ్ గేర్ బాక్స్‌ను కల్పించారు. మరియు ఉత్తమ మైలేజ్ కోసం ఇందులో హోండా ఇకో టెక్నాలజీని ఉపయోగించారు.

- హోండా నుండి కొత్త సిబి హార్నెట్ 160 ఆర్ బైక్: ధర రూ. 79,900
- హోండా కొత్త బైక్ విడుదల: ధర ఎంతో తెలుసా?
- భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దంగా ఉన్న 10 బైక్‌లు !!


Click it and Unblock the Notifications