కొత్త స్టైల్, ఫీచర్స్ తో హోండా ఏవియేటర్ ఆవిష్కరణ
హోండా ఇండియా సరికొత్త యాక్టివా ఐ, ఏవియేటర్ 2015 రెండు మోడళ్లను ఒక్క సారిగా ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లు కొత్త స్టైల్, ఫీచర్స్ తో కొనుగోలుదారులను ఈ మోడళ్ల వైపు ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది.
హోండా 2015 ఏవియేటర్ ధరలు భారత్ లో ఇలా ఉన్నాయి :
- హోండా ఏవియేటర్ స్టాండర్డ్ ( డిస్క్ బ్రేక్ లేకుండా ) వేరియంట్ ధర రూ.50,863 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
- హోండా ఏవియేటర్ డీలక్స్ ( డిస్క్ బ్రేక్ తో ) వేరియంట్ ధర రూ.56,209 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

హెచ్ఎమ్ఎస్ఐ సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ ఉపాధ్యక్షులు వై.ఎస్.గులేరియా మాట్లాడుతూ... ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు హోండా స్కూటర్ ను వాడుతున్నందుకు చాలా గర్వ కారణంగా ఉంది. ప్రతి నెలా 75,000 మంది మహిళలు హోండా స్కూటర్ కుబుంబంలో చేరుతున్నారు అని తెలిపారు.
కొత్త ఏవియేటర్ మస్కలర్ మెటాలిక్ ఫ్రంట్, కన్సోల్ కవర్, హ్యాలోజన్ హెడ్ ల్యాంప్, క్రిస్టల్ క్లియర్ లెన్స్, స్వీపింగ్ సైడ్ ఇండికేటర్స్ మరియు బాడీ-కలర్డ్ గ్రాబ్ గ్రిల్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది.

హోండా ఏవియేటర్ అడ్వాంటేజ్ లు ఈ విధంగా ఉన్నాయి :
- స్టైలిష్ 5-స్పోక్, 12-ఇంచ్ సిల్వర్ అల్లాయ్ వీల్స్.
- సౌకర్యవంతమైన సీట్.
- టెలీస్కోపిక్ సస్పెన్షన్.
- ట్యుబ్ లెస్ టైర్స్.
- మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ.
- సీట్ కింద 20-లీటర్ స్టోరేజ్ స్పేస్.
హోండా యొక్క అన్ని 2015 ఏవియేటర్ స్కూటర్ లు 109.19సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ లను కలిగి ఉన్నాయి. ఇవి 8 హార్స్ పవర్ మరియు 8.77 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి.

హోండా ఏవియేటర్ క్రింది కలర్స్ లో లభించనుంది :
- సిల్వర్ స్ట్రాండ్ మెటాలిక్.
- రెబల్ రెడ్ మెటాలిక్.
- పెర్ల్ సన్ బీమ్ వైట్.
- పెర్ల్ ఇన్జేనియస్ బ్లాక్.

కొత్త హోండా ఏవియేటర్ జూన్, 2015 నుంచి షోరూమ్ లలో అందుబాటులోకి రానుంది. హోండా 2015 సం.లో ఇంత వరకూ ఎనిమిది ద్వి-చక్రవాహనాలను భారత్ లో ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








