10న విడుదలకానున్న హోండా లివో
హోండా మోటార్ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా 2015 ఏడాదిలో కొన్ని కొత్త మోడళ్లను విడుదలచేయనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు తన ప్రస్తుత ఉత్పత్తులను అభివృద్ధిచేస్తోంది.
2015 జూలై 10న తన సరికొత్త లివో మోటర్ సైకిల్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ మోటర్ సైకిల్ సీబీ ట్విస్టర్ స్థానాన్ని భర్తీ చేసి, కస్టమర్లను ఆకట్టుకోనుంది.

జపనీస్ ఆధారిత తయారీ సంస్థ లివోను ప్రీమియం కమ్యుటర్‌గా భారత్‌లో అందిస్తోంది. ఇది హోండా డ్రీమ్ సిరీస్‌ల కంటే పై స్థానాన్ని ఆక్రమించనుంది.
లివో స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 110సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్.
హార్స్‌పవర్ : 9.
టార్క్ : 8.5ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 4-స్పీడ్.

డిజైన్ పరంగా చూస్తే ట్విస్టర్ మరియు డ్రీమ్ సిరీస్‌లను కలిసి ఉన్నట్లు కన్పిస్తుంది. హోండా డిజైనర్స్ దీనికి కొత్త లుక్‌ను తీసుకొచ్చారు.
హోండా లివో ఫ్యాషన్, మహీంద్రా సెంచురో, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోడళ్లకు పోటీగా నిలవనుంది. ధర పరంగా రూ.55,000 లోపు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......


Click it and Unblock the Notifications








