భారతీయ విపణిలోకి రెండు కొత్త బైక్‌లను విడుదల చేసిన హోండా
హోండా మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్ ఇండియా కంపెనీ తన రెండు కొత్త అప్ డేట్ మోడల్స్ అయిన సిబిఆర్150ఆర్ మరియు సిబిఆర్250ఆర్ బైక్‌లను ఆకర్షణీయమైన రంగుల్లో మరియు కొత్త బాడీ డిజైన్‌లతో భారతీయ టూవీలర్ మార్కెట్లోకి విడుదల చేసింది.
హోండాకు చెందిన ఈ రెండు కొత్త టూవీలర్ల కలర్స్, ధర మరియు మరిన్ని ఫీచర్స్ క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

సిబిఆర్150ఆర్ కలర్స్
2016 లో రానున్న కొత్త హోండా సిబిఆర్150ఆర్ మూడు కొత్త రంగుల్లో లభించనుంది.అవి జాజి బ్లూ మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్, క్యాండీ పామ్ గ్రీన్

సిబిఆర్150ఆర్ ఇంజన్
అప్‌డేటెడ్ మోటార్ సైకిల్ సిబిఆర్150ఆర్ 149.9సీసీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో ఉన్న ఇంజన్‌ను కలిగి ఉంది. ఇందులో ఉన్న 6-స్పీడే గేర్ బాక్స్ మీకు 18.28బిహెచ్‌పి మరియు 12.66ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సిబిఆర్150ఆర్ ధర
సిబిఆర్150ఆర్ ధర రూ. 1.30 లక్షలు ఎక్స్-షోరూమ్ (ముంబాయ్). ఇందులో భద్రత పరంగా ముందు మరియు వెనుకవైపున డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. అయితే ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ని అందించలేదు.

సిబిఆర్250ఆర్ లభించు రంగులు
సిబిఆర్250ఆర్ కూడా ఆత్భుతమైన బాడి డిజైన్స్‌తో మరియు సరికొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. అవి స్పోర్ట్స్ రెడ్, పియర్ల్ అమేజింగ్ వైట్ మరియు బ్లాక్.

సిబిఆర్250ఆర్ ఇంజన్
సిబిఆర్250ఆర్ లో 249.60సీసీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇందులో గల 6-స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా దాదాపుగా 26.15బిహెచ్‌పి పవర్ మరియు 22.90 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

సిబిఆర్250ఆర్ ధర
సిబిఆర్250ఆర్ యొక్క ప్రారంభ మోడల్ ధర రూ. 1.69 లక్షలు మరియు సిబిఆర్250ఆర్ లో ఉన్న యాంటిలాక్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గల వేరియంట్ ధర రూ. 1.99 లక్షలు ఎక్స్-షోరూమ్, (ముంబాయ్).

- మరిన్ని టూవీలర్ల విశేషాలు గురించి తెలుసుకోండి...


Click it and Unblock the Notifications








