ఇండియా బైక్ వీక్ 2015: ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 ప్రదర్శన
ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియోకి చెందిన సూపర్‌బైక్ బ్రాండ్ ఆప్రిలియా తమ సరికొత్త 2015 'ఆప్రిలియా ఆర్ఎస్‌వి4' (Aprilia RSV4) మోడల్‌ను గోవాలో జరుగుతున్న 2015 ఇండియా బైక్ వీక్‌లో ప్రదర్శనకు ఉంచింది.
పియాజ్జియో ఆప్రిలియా బైక్‌లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 మోడల్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి - 1. ఆర్ఎస్‌వి 4 ఫ్యాక్టరీ, ఆర్ఎస్‌వి4 ఆర్ (రేసింగ్).
ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 మోడల్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 ఉత్పత్తి తొలిసారిగా 2008లో ప్రారంభమైంది. ఈ మోటార్‌సైకిల్‌ను మొట్టమొదటి సారిగా ఫిబ్రవరి 22, 2008న ఇటలీలో ఆవిష్కరించారు.

ఆప్రిలియా ఆర్ఎస్వి4 బైక్‌లో 65-డిగ్రీ 999.6సీసీ, వి-4 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 200 హార్స్‌పవర్‌లకు పైగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఆప్రిలియా ఆర్ఎస్‌వి4లో ముందు వైపు 320 మి.మీ. డయామీటర్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 220 మి.మీ. డయామీటర్ డిస్క్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇవి రెండూ బ్రెంబో కంపెనీకి చెందినవి. ఇందులో ఏబిఎస్ కూడా ఉంటుంది.

ఆప్రిలియా ఆర్ఎస్వి4 బైక్‌లో ముందు వైపు 120/70 ZR17 సైజ్ టైరును, వెనుక వైపు 190/55 ZR17 సైజు టైరును ఆఫర్ చేస్తున్నారు.

ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు. దీని మొత్తం బరువు 170 కేజీలు. సీట్ హైట్ 845 మి.మీ.

ఆప్రిలియా ఆర్ఎస్‌వి1000ఆర్ మోడల్‌కి రీప్లేస్‌మెంట్ మోడల్‌గా 2008లో ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 మోడల్‌ను ప్రవేశపెట్టారు.


Click it and Unblock the Notifications








