కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ మోటార్ సైకిల్ : త్వరలో మార్కెట్లోకి విడుదల..
కవాసకి టూ వీలర్స్ వారు భారతీయ స్పోర్ట్స్ బైకులను అందివ్వడంలో తమదైన ముద్ర వేసుకుంది. ఈ ఏడాదికి చివరి మోడల్‌గా కవాసకి మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి వెర్సేస్ 650 అడ్వెంచర్ పేరుతో ఒక స్పోర్ట్స్ బైకును ప్రవేశ పెట్టనుంది. దీనిని ఈ నెల 24 తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
దీని గురించి మరింత సమాచారం క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

టార్గెట్
కవాసకి టూ వీలర్స్ దాదాపుగా 1000 యూనిట్ల వెర్సేస్ 650 అడ్వెంచర్ బైకులను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిసింది. దీని కోసం కేవలం 1000 యూనిట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

నింజా 650 కన్నా తక్కువ
అతి త్వరలో విడుదల కానున్న ఈ కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ స్పోర్ట్స్ బైకు కవాసకి ఉత్పత్తులైన నింజా 650 మోడల్ కన్నా తక్కువ స్థానంలో మరియు జడ్800 మోడల్ కన్నా ఎక్కువ స్థానంలో ఉంటుంది.

ఇంజన్
కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ బైకులో సమాంతరంగా ఉన్న రెండు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ 649సీసీ కెపాసిటి గల ఇంజన్ ఉంది.

పవర్
ఇందులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 69 బిహెచ్‌పి పవర్ మరియు 64 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో గల ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

సికెడి మరియు ఎబియస్
కవాసకి వారు ఈ వెర్సేస్ 650 అడ్వెంచర్ స్పోర్ట్స్ బైకును కంప్లీట్లి నాక్డ్ యూనిట్ అప్షన్‍తో రూపొందించారు. మరియు దీనిలో స్టాండర్జ్ ఫీచర్‌గా యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు.

- డ్రైవర్ తెలివికి జోహార్...!!
- బోయింగ్ కొత్త ప్యాసింజర్ ప్లేన్ 737 మ్యాక్స్ : ప్రత్యేకతలేంటో చూద్దామా?
- బెస్ట్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్: యమహా వైజడ్‌ఎఫ్-ఆర్3


Click it and Unblock the Notifications








