భారతీయ మార్కెట్లోకి కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ విడుదల
కవాసకి టూ వీలర్స్ వారు భారత దేశపు స్పోర్ట్స్ బైకుల మార్కెట్లోకి సరి కొత్త వెర్సేస్ 650 అడ్వెంచర్ టూరర్ బైకును విడుదల చేసింది. స్పోర్ట్స్ బైకుల ప్రేమికుల కోసం సరిగ్గా నూతన సంవత్సర సంభరాలు ప్రాంరభం కానున్న నేపథ్యంలో దీని విడుదల మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ టూరర్ బైకు గురించి మరిన్ని వివరావలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

ఇంజన్
ఈ సరి కొత్త వెర్సేస్ 650 అడ్వెంచర్ స్పోర్ట్స్ బైకులో 649 సీసీ గల ఫోర్ స్ట్రోక్ లిక్విడ్-కూలింగ్ ఇంజన్ కలదు.

పవర్
ఈ ఇంజన్ మీకు ఇస్తుంది 68.1 బిహెచ్‌పి పవర్ మరియు 64 ఎన్‌ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వెర్సేస్ ఫీచర్లు
ఇందులో 17 ఇంచుల చక్రాలు, ముందు వైపు 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపున 250 ఎమ్ఎమ్ గల డిస్క్ బ్రేక్ కలదు. వీటితో పాటు యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అప్షన్ కూడా ఇందులో కలదు.

సస్పెన్షన్
ఇందులో ముందు వైపున ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున ఆఫ్ సెట్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

సికెడి
కవాసకి ఈ మోటార్ సైకిల్స్‌ను కంప్లీట్లి నాక్‌డ్ డౌన్ యూనిట్‌తో రూపొందించారు. వీటని కవాసకి ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ప్లాంటు ద్వారా దిగుమతి చేసుకోనుంది.

ధర
కవాసకి వారి సరికొత్త స్పోర్ట్స్ బైక్ వెర్సేస్ 650 అడ్వెంచర్ టూరర్ ధర రూ. 6,60,000 ఎక్స్-షో రూమ్, (ఢిల్లీ).


Click it and Unblock the Notifications








