దీపావళి కోసం మహీంద్ర గస్టొ స్పెషల్ ఎడిషన్ విడుదల
మహీంద్ర టూవీలర్స్ ఈ దీపాళికి తన గస్టొ నుండి స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 51,560. ఎక్స్-షోరూమ్ గా నిర్ణయించారు. గస్టొ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ మహీంద్ర యొక్క విఎక్స్ ట్రిమ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ విఎక్స్ ట్రిమ్ మంచి ఫ్యూచర్‌లతో నిండి ఉంది. మరియు ఈ పండుగ సీజన్ నేపథ్యంలో ఉచిత ఇన్సూరెన్స్ కూడా అందిస్తోంది.
మహీంద్ర గస్టొ రెండు కొత్త రంగుల్లో లభిస్తోంది. ఈ మహీంద్ర స్పెషల్ ఎడిషన్ ఐస్ కూల్ రెడ్ మరియు సిల్వర్ మ్యాగ్నెట్టా వంటి రంగుల్లో రానుంది అయితే మెకానికల్ పరంగా ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.

గస్టొ శక్తి వంతమైన 109.9 సీసీ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 7.9బిహెచ్‌పి మరియు 9ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కంటిన్యుయస్లి వేరెబుల్ ట్రాన్స్‌మిషన్ కలదు ఇది మీకు దాదాపుగా 63.7 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

మహీంద్ర గస్టొలో కొన్ని ప్రత్యేక్య లక్షణాలు ఉన్నాయి అవి హైట్ అడ్జస్టబుల్ సీట్, రిమోట్ ఫ్లిప్ కీ, ఫైండ్ మి ల్యాంప్స్, గైడ్ ల్యాంప్స్, ట్యూబ్ లెస్ టైర్లు, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ కిక్ వంటి ఎన్నో అధునాతనమైన ఫీచర్లు ఇందులో మీరు చూడవచ్చు.
Also Read: సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్: మరి ఇందులో మీ బైక్ ఉందా?
మహీంద్ర కంపెని ఈ మధ్యనే మోజో అను బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది, దీని ధర 1.8 లక్షలుగా ఉంది. దీనికి సంభందించిన పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి: యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం



Click it and Unblock the Notifications








