మహీంద్ర కొత్త లోగో మోజో అధికారికంగా విడుదల
మహీంద్ర యొక్క కొత్త లోగో మోజో ను అధికారికంగా విడుదల చేశారు. మహీంద్ర కంపెనీ తమ మోటర్ సైకిల్స్ పై ఒక కొత్త గుర్తింపును తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగానే తమ మోటర్ సైకిల్స్ కోసం ఒక అధికారిక లోగోను విడుదల చేసింది. అయితే మహీద్ర ద్విచక్రవాహనాల విభాగం మాత్రం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని తీసుకువస్తూ తన కంటూ ఒక ప్రత్యేక్యతను చాటుకుంటోంది.

మహీంద్ర కంపెనీ తమ మోజో లోగో తయారీలో భాగంగా విసృతమైన పరిశోధనలు జరిపింది. దీనిని ద్విచక్ర వాహనాలలో గల అతి పదునైన విడిభాగాల నుండి గ్రహించిన డిజైన్స్ ప్రేరణతో తయారు చేసినట్లు తెలిపారు. మహీంద్ర ద్విచక్ర వాహనాల ప్రకారం లోగో లో గల అతి పదునైన గీతలు 'కంట్రోల్డ్ డైనమిస్మ్' ఒక హైలెట్ గా నిలుస్తుందన్నారు. అంతే కాకుండా మహీంద్ర తన ఫేస్‌పేజ్‌లో రిలీజ్ తేదిని వెలువరించే స్థానంలో తమ అధికారిక లోగో ను ఉపయోగించనున్నట్లు కంపెని తెలిపింది.
మహీంద్ర నుండి రానున్న మోజోలో కె.టి.ఎమ్ డ్యూక్ 390 వంటి ప్రసిద్ద బైక్ కలిగిన ప్రత్యేక విశిష్ఠతలు ఎన్నో ఇందులో ఉన్నాయి.
మీ కోసం మహీంద్ర మోజో యొక్క స్పెసిఫికేషన్స్:
- ఇంజిన్ సింగిల్ సిలిండర్ 300సీసీ ఇంజిన్
- కూలింగ్ సిస్టమ్ లిక్విడ్ కూల్డ్
- హార్స్ పవర్ ఇది వెనుక చక్రాల కోసం 27 హార్స్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది
ఈ బైక్ విసృతమైన పరీక్షలను ఇండియాలో జరుపుకుంది అంతే కాకుండా దీనిని దేశీయంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








