యమ్‌వి అగస్టా యఫ్4 ఇండియాలో విడుదల: ధర, ఫీచర్లు మీ కోసం.
యమ్‌వి అగస్టా తన యప్4 సూపర్ బైక్‌ను ఇండియాలో విడుద చేసింది. చక్రాల మీద చిత్రాలను వేసే కంపెనీగా మనకు బాగా సుపరిచితమైన యమ్‌వి అగస్టా ఇప్పుడు భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో కైనటిక్ గ్రూప్‌తో చేతులు కలిపింది.
కైనటిక్ మరియు అగస్టా రెండు కంపెనీలు సంయుక్తంగా ఈ మధ్యనే బ్రుటాలి 1090 మరియు యఫ్4 మోడల్స్‌ను పూనెలో విడుదల చేశారు.
Also Read: యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం
యమ్‌వి అగస్టా మోటార్ సైకిల్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింది స్లైడర్‌ల మీద ఏ కన్నేయండి.

యమ్‌వి అగస్టా యఫ్4 ఇంజన్ :
ఇందులో ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ 998సీసీ గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది మీకు 192.25బిహెచ్‌పి మరియు 110.8 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజనీర్లు ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు.

యమ్‌వి అగస్టా యఫ్4 ధర :
యమ్‌వి అగస్టా యఫ్4 సూపర్ బైక్ యొక్క ధర రూ. 25.5 లక్షలు ఎక్స-షోరూమ్(పూనే) గా నిర్ణయించారు.

యమ్‌వి అగస్టా యఫ్4 స్పెసిఫికేషన్స్ :
యమ్‌వి అగస్టా యఫ్4 సూపర్ బైక్‌లో మోటర్ అండ్ వెహికల్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించారు. మరియు ఎలక్ట్రానికల్ అసిస్టెడ్ షిఫ్ట్(ఇఎయస్), టార్క్ షప్ట్ సిస్టమ్, లీన్ యాంగిల్ సెన్సార్, 8-స్టేజ్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ ప్యాకేజ్ విత్ రైడ్-బై-వైర్.

పోటి :
ప్రస్తుతం యమ్‌వి అగస్టా యఫ్4 మార్కెట్లో ఉన్న డుకాటి 1299 పనిగాలే సూపర్ బైక్‌తో పోటి పడనుంది.

లగ్జరీ బైక్ :
యమ్‌వి అగస్టా యఫ్4 సూపర్ బైక్ ప్రీమియమ్ మరియు లగ్జరీ మోటార్ బైక్ ఇది. దీనిని ఇటాలియన్‌కు చెందిన రెండు కంపెనీలు యమ్‌వి అగస్టా మరియు కైనటిక్ కలిసి భారతీయ మార్కెట్ కోసం రూపొందించాయి.

బుకింగ్స్ :
యమ్‌వి అగస్టా యఫ్4 సూపర్ బైక్ మరియు బ్రుటాలి 1090 బైక్, రెండింటిని తమ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన motoroyale.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








