రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లపై వారంటీ పెంపు

By Ravi

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్. ఈ కొత్త సంవత్సరంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుగోలు చేసే కస్టమర్లు, తమ బైక్‌పై అదనపు వారంటీని పొందవచ్చు. ఐషర్ మోటార్స్‌కి చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్, తమ మోటార్‌సైకిళ్లపై అదనపు వారంటీని ఆఫర్ చేస్తోంది.

ఈ ఏడాదిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కొనుగోలు చేసే కస్టమర్లు సదరు మోటార్‌సైకిల్‌పై రెండేళ్లు లేదా 20,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని పొందవచ్చు. ఇదివరకు అదనపు వారంటీ సౌకర్యం అందుబాటులో లేదు. కేవలం ఒక సంవత్సరం పరిమిత వారంటీ మాత్రమే అమల్లో ఉండేది.

Royal Enfield

ఈ అదనపు వారంటీని ఆఫర్ చేయటం వలన మోటార్‌సైకిళ్ల డిమాండ్ మరింత పెరిగే ఆస్కారం ఉంది. వాస్తవానికి అదనపు వారంటీని పొందాలంటే, కస్టమర్లు తమ జేబులో నుంచి కొత్త మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం ఎలాంటి అదనపు చార్జీని వసూలు చేయకుండానే ఈ వారంటీని ఆఫర్ చేయనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం భారత మార్కెట్లో 11 విభిన్న ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. ఇందులో బుల్లెట్ 350, క్లాసిక్ 350, థండర్‌బర్డ్ 350, బుల్లెట్ 500, క్లాసిక్ 500, థండర్‌బర్డ్ 500, బుల్లెట్ ఎలక్ట్రా, క్లాసిక్ డెసెర్ట్ స్టోర్మ్, క్లాసిక్ క్రోమ్, క్లాసిక్ బ్యాటిల్ గ్రీన్ మరియు కాంటినెంటల్ జిటి వంటి మోడళ్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 29, 2015, 9:43 [IST]
English summary
Royal Enfield has opted to give its motorcycle owners confidence of ownership. They will offer warranty of either two years or 20,000 kilometres, which ever occurs first.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+