ఇక ఆన్‌లైన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ గుడీస్ కొనుక్కోవచ్చు!

By Ravi

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రియులకు శుభవార్త. ఈ బ్రాండ్‌కి సంబంధించి వస్తువులు కొనుగోలు చేయాలంటే, కస్టమర్లు ఇక డీలర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఏజివి హెల్మెట్ల్, గ్లవ్స్, షూస్, బఫ్స్ మొదలైన అఫీషియల్ సేఫ్టీ గేర్‌ను ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లు కొనుగోలు చేసి, ఇంటి వద్దకే డెలివరీ తెప్పించుకోవచ్చు.

అంతేకాకుండా.. ఈ ఆన్‌లైన్ స్టోర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షర్టులు, రైడింగ్ జాకెట్స్, రైడింగ్ ప్యాంట్స్‌ని కూడా విక్రయిస్తోంది. ఇందుకు కస్టమర్లు చేయాల్సిందల్లా వెబ్‌సైట్‌ను సందర్శించి, తమకు నచ్చిన వస్తువును బుక్ చేసుకోవటమే.

royal enfield online store india

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాతింగ్, అప్పీరల్ రేంజ్‌ను ప్రపంచ యుద్ధంలోని 'డిశ్పాచ్ రైడర్' (గ్రౌండ్ ఫోర్సెస్‌కు మరియు హెడ్‌క్వార్టర్స్‌కు మధ్య సమాచారాన్ని చేరవేసే రైడర్) మరియు 1960 సమయంలోని 'కెఫే రేసర్ కల్చర్' (అప్పటి లైఫ్‌స్టైల్‌కు తగిన విధంగా డ్రెస్ కోడ్) ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా డిజైన్ చేశామని కంపెనీ పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ-స్టోర్ డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా కేవలం ఆన్‌లైన్ లావాదేవీలను మాత్రమే అంగీకరిస్తుంది. ఈ ఆన్-లైన్ స్టోర్‌లో విక్రయించే వస్తువుల రేట్లు సరసంగానే ఉన్నాయని మోటారిస్టులు చెప్పుకుంటున్నారు. మరిన్ని వివరాల కోసం పైన తెలిపిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆన్‌లైన్ షాపింగ్ లింక్‌పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 26, 2015, 17:17 [IST]
English summary
Royal Enfield has launched its online store (http://store.royalenfield.com/) that retails a variety of official safety gear, including helmets, gloves, shoes, buffs and apparel such as shirts, jackets and trousers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+