ఏడాదికో మోడల్ ఆవిష్కరించనున్న రాయల్ ఎన్ఫీల్డ్
భారత ద్విచక్రవాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని కొత్త మోడళ్లను భారత్ లో ఆవిష్కరించింది. ఈ సంస్థ భారత్ లో తన ద్విచక్రవాహనాలను తయారుచేసి ప్రపంచమంతటికీ సరఫరా చేస్తోంది.
అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 2016 నుంచి ఏడాదికో సరికొత్త మోడల్ ను ప్రపంచానికి ఆవిష్కరించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పరీక్షించడం పూర్తైన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ మోడల్ ను త్వరలో విడుదల చేయనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని మోటార్ సైకిళ్లను ప్రదర్శనకు ఉంచుతూ తన షోరూమ్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తొలిసారి ప్రారంభించింది.
ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ అందిస్తున్న వాటి వివరాలు ఇలా ఉన్నాయి....
- స్టాండర్డ్ స్ట్రీట్ రేంజ్ లో బుల్లెట్ 350, బుల్లెట్ 500 మరియు బుల్లెట్ ఎలెక్ట్రా.
- రెట్రో స్ట్రీట్ రేంజ్ లో క్లాసిక్ 350 , క్లాసిక్ 500, క్లాసిక్ క్రోమ్, క్లాసిక్ బ్యాటిల్ గ్రీన్ మరియు క్లాసిక్ డెసర్ట్ స్ట్రోమ్.
- రాయల్ ఎన్ఫీల్డ్ క్రూసర్ రేంజ్ లో తండర్ బర్డ్ 350 మరియు తండర్ బర్డ్ 500.
- రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ అని పిలువబడే కేఫ్ రేసర్ మోడల్ ను కూడా అందిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ భవిష్యత్తులో ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజన్ లను తయారు చేసేందుకు ఇష్టపడుతోంది. అలాగే సరికొత్త లుక్ తో కొత్త మోటార్ సైకిల్ రేంజ్ లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications